Akira Nandan : పవన్ కొడుకు అకిరా నందన్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవే.. అకిరా ఎడిటింగ్స్ అదిరిపోయాయిగా..

రేణు దేశాయ్ అకిరా నందన్ ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది.

Akira Nandan : పవన్ కొడుకు అకిరా నందన్ యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ఇవే.. అకిరా ఎడిటింగ్స్ అదిరిపోయాయిగా..

Pawan Kalyan Son Akira Nandan Editing Social Media Accounts goes Viral

Updated On : June 6, 2024 / 5:28 PM IST

Akira Nandan : పవన్ తనయుడు అకిరా నందన్ సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సినిమాల్లోకి వచ్చినా హీరో అవ్వడు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అని గతంలో రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో అకిరా నందన్ హవా నడుస్తుంది. పవన్ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి అకిరా తన తండ్రి పక్కనే ఉంటున్నాడు. చంద్రబాబుని, మోదీని కలిసాడు.

Also Read : Yevam Trailar : ‘యేవమ్’ ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన చాందిని చౌదరి..

దీంతో అకిరా నందన్ ఫోటోలు గత మూడు రోజులుగా వైరల్ అవుతున్నాడు. ఇక రేణు దేశాయ్ కూడా అకిరా ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది. అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ అని, కీ బోర్డు బాగా వాయిస్తాడనే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ రేణు దేశాయ్ నిన్న అకిరా నందన్ తన తండ్రి పై చేసిన పవర్ ఫుల్ ఎడిటింగ్ వీడియో షేర్ చేసి అకిరా మంచి ఎడిటర్ అని తెలిపింది.

View this post on Instagram

A post shared by chordfather (@thechordfather)

అయితే అకిరా ఎడిటింగ్ చేసిన వీడియో షేర్ చేస్తూ అకిరా నందన్ ఎడిటింగ్స్ పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా షేర్ చేసింది. the chord father అనే పేరుతో అకిరా నందన్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఇందులో తను ఎడిటింగ్ చేసిన వీడియోలను షేర్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. ఇలా చాలా మంది హీరోల మీద అదిరిపోయే ఎడిటింగ్స్ చేసి పోస్ట్ చేస్తున్నాడు. మొదటి సారి రేణు దేశాయ్ ఇది అకిరా నందన్ అకౌంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా the chord father వైరల్ అవుతుంది.

ఇక అకిరా ఎడిటింగ్స్ చూసి అందరు హీరోల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆ అకౌంట్ ని ఫాలో చేస్తున్నారు. అకిరాలో మంచి ఎడిటర్ కూడా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మార్షల్ ఆర్ట్స్ లో కూడా అకిరా శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అకిరా హీరో, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా సినీ పరిశ్రమలో ఎందులో ఎదుగుతాడో అని పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.