Pawan Kalyan: వీరమల్లు లుక్ నుంచి బయటకొచ్చేసిన పవన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్.....

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, హిస్టారికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Hari Hara Veeramallu: జాక్వెలిన్ కాదు.. పవన్ సినిమాలో ముంబై మనోహరి!

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం పవన్ గతకొంత కాలంగా ఒకే తరహా లుక్‌లో కనిపిస్తూ వచ్చాడు. భీమ్లా నాయక్ చిత్రం తరువాత వీరమల్లు లుక్‌లో పవన్ మనకు కనిపించాడు.

Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?

కానీ, ఇప్పుడు తాజాగా పవన్ వీరమల్లు లుక్ నుండి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన లుక్‌ను పూర్తిగా మార్చేయడంతో పవన్ వీరమల్లు సినిమా షూటింగ్‌లో ఇప్పట్లో పాల్గొంటాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, తమిళ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు