×
Ad

Pawan Kalyan: డిజాస్టర్ డైరెక్టర్.. ఒకేసారి రెండు కథలు.. పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడో..

ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో (Pawan Kalyan)తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేశాడు.

Pawan kalyan doing a movie with director surender reddy

Pawan Kalyan: ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్(Pawan Kalyan) చేశాడు. మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ తో సహా డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాల తరువాత కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా రాజకీయాలకే పరిమితం అవుతాడా అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది.

Adah Sharma: వాళ్ళు చంపేస్తాం అన్నారు.. వీళ్ళు కాపాడుతూ వచ్చారు.. అదా శర్మ షాకింగ్ కామెంట్స్

కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు గతంలో డేట్స్ ఇచ్చిన నిర్మాతల సినిమాలు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సన్నద్ధం అవుతున్నాడట. ఆ వరుసలో ముంగుగా ఉన్న సినిమా అంటే నిర్మాత రామ్ తాళ్లూరిదే అని చెప్పాలి. దాదాపు రెండేళ్ల క్రితమే నిర్మాత రామ్ తల్లూరితో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించనున్నాడు.

అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కాలేదు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట పవన్ కళ్యాణ్. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు కోసం పాన్ ఇండియా రేంజ్ లో రెండు కథలను సిద్ధం చేశాడట వక్కంతం వంశీ. అందులో ఒకటి హైదరాబాద్ లోకల్ మాఫియా బ్యాక్డ్రాప్ తో ఉండగా.. రెండవది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న గ్యాంగ్ స్టార్ డ్రామ. పవన్ కళ్యాణ్ కాస్త టైం ఇస్తే ఈ రెండు కథలను వినిపించి ఎదో ఒకదానికి పట్టాలెక్కించాలని చూస్తున్నాడట నిర్మాత రామ్ తాళ్లూరి. ఈ విషయంఫై త్వరలోనే మేకర్స్ నుంచి కూడా అధికారిక ప్రకటన రానుంది అని టాక్ వస్తోంది. మరి ఓజీ తరువాత కూడా పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకోవడంపై ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.