ఏపీలో కూడా మంచి టూరిజం ప్లేస్‌లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి షూటింగ్‌లు చేయండి. అప్పుడు నవ్యాంధ్రలో కూడా ఫిలిం టూరిజం డెవలప్ అవుతదంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. న్యూజిలాండ్, యుక్రెయిన్ వంటి దేశాలు సినిమా టూరిజం ద్వారా అభివృద్ధి చెందాయని, ఆ దేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో ఫిలిం టూరిజాన్ని ప్రోత్సహించాలంటున్నారు పవన్ కల్యాణ్.
ఏదైనా సినిమాలో ఒక సీన్‌లో ఏపీలో అందమైన లొకేషన్లను హైలైట్ చేయడం ద్వారా అది పాపులర్ అవుతుందని అంటున్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్రను పవన్ హైలైట్ చేశారు. ప్రతి సినిమాలో ఏపీలోని లొకేషన్లను హైలైట్ చేస్తే టూరిజం ఈజీగా అభివృద్ధి అవుతుందన్నారు. రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా మార్చే ప్రణాళికలను వివరించిన పవన్.. సినీ ఇండస్ట్రీకి ఓ రిక్టెస్ట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అవ్వటంతో టాలీవుడ్ ఫుల్ ఖుషీ అయింది. అందుకు తగ్గట్లుగా పవన్ కూడా ఏపీలో టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి పెద్ద సినిమాలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇప్పిస్తున్నారు. కల్కి, దేవర లాంటి సినిమాలు ఎంత అడిగితే అంత పెంచారు. అంతేకాదు అదనపు షోలకు పర్మిషన్, పెయిడ్ ప్రీమియర్స్‌కు కూడా అనుమతులు వచ్చేస్తున్నాయి. టాలీవుడ్ ఏది అడిగితే ఏపీ ప్రభుత్వం అది ఇచ్చేస్తుంది.
అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీలో సినిమా షూటింగ్‌లు తీయాలని ఆహ్వానం పలకడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏపీలో ఫిలిం టూరిజం డెవలప్ అయ్యేందుకు సినీ ఇండస్ట్రీ సహకరించాలంటున్నారు. ఏపీలో చాలా టూరిజం ప్లేస్‌లు ఉన్నాయంటున్న పవన్, ఇక్కడకు వచ్చి ఆ ప్లేస్‌లల్లో షూటింగ్స్ చేస్తే చాలా పాపులర్ అవుతాయంటూ కామెంట్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఏ హెల్ప్ కావాలన్నా అడిగిన వెంటనే సాయం చేసి పెడుతున్న పవన్ కల్యాణ్ రిక్వెస్ట్‌కు..ఇప్పుడు సినిమా షూటింగ్‌ల విషయంలో సినీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్న ఆసక్తికరంగా మారింది.