Hari Hara VeeraMallu
Hari Hara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మాములు సినిమాలకే తెల్లవారు జామున షోలు, ముందురోజు రాత్రే ప్రీమియర్లు వేస్తున్నారు. అలాంటింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు తెల్లవారు జామున షోలు లేకపోతే ఎలా..
నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. మొదట తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి షోలు వేద్దాం అనుకున్నాం. కానీ ఫ్యాన్స్ ముందుగానే షోలు వేయమని అడుగుతున్నారు. అందుకే ముందురోజు రాత్రి 9.30 గంటల నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము. ఏపీలో అనుమతులు వస్తాయి. తెలంగాణలో కూడా అనుమతులు వస్తాయి. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారితో, సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి గారితో మాట్లాడాము అన్నారు.
ఏపీలో ఎలాగో తెల్లవారుజామున షోలు ఉంటాయని ముందే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా ఉన్నాయి అని చెప్పడంతో ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు. అయితే తెలంగాణలో పుష్ప సంఘటన తర్వాత ప్రీమియర్లు, తెల్లవారు జామున షోలకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు పర్మిషన్ ఇస్తారని చెప్పడంతో ఇక్కడ కూడా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 23 రాత్రి నుంచి హరిహర వీరమల్లు షోలు పడతాయని తెలుస్తుంది.
Also Read : Shah Rukh Khan : షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ బాద్‌షా.. ఆందోళనలో అభిమానులు