Shah Rukh Khan : షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ బాద్‌షా.. ఆందోళనలో అభిమానులు
తన కూతురు సుహానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్.

Shah Rukh Khan
Shah Rukh Khan : వరుసగా పఠాన్, జవాన్, డంకి సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తన కూతురు సుహానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్.
నేడు కింగ్ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి అని సమాచారం. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన చికిత్స కోసం షారుఖ్ అమెరికాకు వెళ్తున్నాడని సమాచారం. ఈ గాయాలతో షారుఖ్ నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు.
Also Read : OG : టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఓజీ? 1000 కోట్లు..?
దీంతో షారుఖ్ అభిమానులు కంగారుపడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే షారుఖ్ కి ఏ గాయం అయింది, ఎలాంటి గాయం, ఎలా జరిగింది.. వంటి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.