OG : టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఓజీ? 1000 కోట్లు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజీ సినిమా మేకింగ్ స్పీడందుకుంది.

OG Sketch to Join 1000 Crore Club
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ఓజీ సినిమా మేకింగ్ స్పీడందుకుంది. ఆల్‌మోస్ట్ షూటింగ్ పూర్తి అయి..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాపై టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ మూవీపై ఫ్యాన్స్ హోప్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
ఈ సినిమా నిర్మాతతో పాటు పవన్ కల్యాణ్ కూడా గట్టి నమ్మకమే పెట్టుకున్నారట. సుజీత్ డైరెక్షన్‌లో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్ వంటి స్టార్ కాస్ట్‌తో.. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవుతోంది.
OG సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరాలనే లక్ష్యంతో పవన్ టీమ్ ముందుకు సాగుతోందట. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో థియేట్రికల్ రైట్స్ రూ.169 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. అంతేకాదు నార్త్ ఇండియాలో కూడా పవన్ రీసెంట్ పొలిటికల్ స్టేటస్‌తో ఈ సినిమాకు భారీ హైప్ వస్తోందట. ఈ ఊపుతో ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆడియో, శాటిలైట్, ఇతర రైట్స్‌తో కలిపి ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.325 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారట. ఇలా ఓవరాల్‌గా 1000 కోట్ల క్లబ్‌లో ఓజీ చేరాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా పవన్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు, తమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ‘OG’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఓజీ రిలీజ్ రోజే అఖండ-2 విడుదల అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ తప్పదని చర్చ ఉంది. OG 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా.? ఈ గాసిప్ నిజమవుతుందా.? వేచి చూడాలి.