Kireeti : ఒక్క మాల్ లో ప్రమోషన్ కోసమే ఏకంగా 25 లక్షలు.. ఈ హీరో లాంచింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్..

అతన్ని, అతని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కోసం కోట్లల్లో ఖర్చుపెట్టారు.

Kireeti : ఒక్క మాల్ లో ప్రమోషన్ కోసమే ఏకంగా 25 లక్షలు.. ఈ హీరో లాంచింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టి ప్రమోషన్స్..

Kireeti

Updated On : July 18, 2025 / 5:13 PM IST

Kireeti : సినీ పరిశ్రమలో హీరో అవ్వాలంటే బోల్డంత కష్టం, ట్యాలెంట్ తో పాటు చాలా లక్ కూడా ఉండాలి. కానీ కొంతమంది నిర్మాతల కొడుకులు, డబ్బున్న వాళ్ళ తనయులు మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తారు. హీరోగా ఎంట్రీ వీళ్లకు ఈజీ అయినా తర్వాత నిలబడాలంటే ఎంత డబ్బున్నవాళ్ళైనా కష్టపడాల్సిందే, ట్యాలెంట్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఓ హీరోని లాంచ్ చేయగా అతన్ని, అతని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ కోసం కోట్లల్లో ఖర్చుపెట్టారు.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు. కర్ణాటక రాజకీయ నేత, మైనింగ్ లో బాగా డబ్బులు సంపాదించిన వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి. కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ మూడేళ్ళ క్రితమే సినిమాని ప్రకటించారు. పలు కారణాలతో అది వాయిదా పడుతూ ఇవాళ్టికి రిలీజయింది. కిరీటి హీరోగా శ్రీలీల హీరోయిన్ గా, జెనీలియా, రవిచంద్రన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన జూనియర్ సినిమా నేడు జులై 18 న కన్నడ, తెలుగులో రిలీజయింది.

Also Read : Tourist Family : 2025లో ఎక్కువ ప్రాఫిట్ చూసిన సినిమా ఇదే.. వివాదంతో పాటు 1200 శాతం లాభాలు.. ఏ తెలుగు సినిమా దరిదాపుల్లో లేదుగా..

అయితే ఈ జూనియర్ సినిమాని కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రమోట్ చేసారు. అన్ని థియేటర్స్ లో ఈ సినిమానే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు చేసారు. ఈ సినిమాకు రాజమౌళిని సైతం ప్రమోషన్స్ కి రప్పించారు. ఇవన్నీ అందరూ చేసేవే అయితే కిరీటిని, జూనియర్ ని సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయించారు. సోషల్ మీడియాలో మీమ్ పేజీలు, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ లో సినిమా గురించి, కిరీటి ట్యాలెంట్ గురించి బాగానే ఖర్చుపెట్టి ప్రమోట్ చేయించారు. కేవలం జూనియర్ సినిమా ప్రమోషన్స్ కే 10 కోట్లు ఖర్చుపెట్టారని టాలీవుడ్ టాక్.

అయితే హైదరాబాద్ లోని ఫేమస్ మాల్, థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ ని జూనియర్ ప్రమోషన్స్ తో నింపేశారు. ప్రసాద్ ఐమాక్స్ లో బయట గ్లాస్ ఎలివేషన్ నుంచి ప్రతి ఫ్లోర్ లో, ప్రతి డోర్ మీద, గోడలకు స్టిక్కర్స్, బ్యానర్స్ తో పాటు, డిజిటల్ పోస్టర్స్.. ఇలా మాల్ అంతా జూనియర్ తో నింపేశారు. హైదరాబాద్ లో చాలా మంది ఇక్కడికే వచ్చి సినిమా చూడటానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి సినిమా లవర్స్ కి జూనియర్, కిరీటి దగ్గరవ్వాలని ఐమాక్స్ అంతా ఇవే కనపడేలా ప్రచారం చేసారు. ఈ ప్రచారానికి ఒక్క ఐమాక్స్ కే దాదాపు 25 లక్షలు ఖర్చుపెట్టినట్టు సమాచారం. ఎంతైనా డబ్బుంటే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు, అందరికి తెలిసేలా చేయొచ్చు అని మరోసారి ప్రూవ్ చేసారు. కిరీటి ఈ సినిమాలో తన ట్యాలెంట్ కూడా చూపించాడు కాబట్టి మరి తర్వాత హీరోగా కష్టపడి నిలబడతాడా చూడాలి.

Also Read : Sreeleela : అసలు నేనెలా లవ్ చేస్తా.. ఎట్టకేలకు లవ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. అమ్మతో ముడిపెడుతూ..