Tourist Family : 2025లో ఎక్కువ ప్రాఫిట్ చూసిన సినిమా ఇదే.. వివాదంతో పాటు 1200 శాతం లాభాలు.. ఏ తెలుగు సినిమా దరిదాపుల్లో లేదుగా..
గతంలో కాంతారా, లవ్ టుడే, ప్రేమమ్.. లాంటి చిన్న సినిమాలు భారీ హిట్స్ కొట్టి ఎక్కువ శాతం లాభాలు ఆర్జించాయి.

Tourist Family
Tourist Family : ఇటీవల సినీ పరిశ్రమలో సక్సెస్ సినిమాలు చాలా తక్కువే. ఇక భారీ లాభాలు అందుకుంటున్న సినిమాలు చేతివేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. హిట్ సినిమాలు కూడా వందల కోట్లు పెడితే ఎంతో కొంత మార్జిన్ తో బయట పడుతున్నాయి. కానీ కొన్ని చిన్న సినిమాలు క్లిక్ అయితే మాత్రం కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నాయి. గతంలో కాంతారా, లవ్ టుడే, ప్రేమమ్.. లాంటి చిన్న సినిమాలు భారీ హిట్స్ కొట్టి ఎక్కువ శాతం లాభాలు ఆర్జించాయి.
అలా 2025 లో ఇప్పటివరకు పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ శాతం లాభాలు ఆర్జించిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ. అభిషన్ జీవినాథ్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్.. పలువురు కీలక పాత్రల్లో తమిళ్ లో తెరకెక్కిన సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి ఓ ఫ్యామిలీ ఇండియాకు వచ్చి సెటిల్ అయిన కథతో కామెడీ ఎమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.
Also Read : Sreeleela : అసలు నేనెలా లవ్ చేస్తా.. ఎట్టకేలకు లవ్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. అమ్మతో ముడిపెడుతూ..
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 7 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 90 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాని వేరేభాషల్లో ఎక్కువగా ప్రమోట్ చేయలేదు. లేకపోతే 100 కోట్లు ఈజీగా దాటేసేది. టూరిస్ట్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ 1200 శాతం లాభాలు చూసింది. ఈ ఇయర్ లో ఇండియా మొత్తంలో ఎక్కువ శాతం ప్రాఫిట్స్ చూసిన సినిమాగా ఇదే నిలిచింది. అయితే ఈ సినిమా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని ప్రమోట్ చేసిందని వివాదాలు కూడా ఎదుర్కొంది.
టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత హిందీ చావా సినిమా 800 శాతం ప్రాఫిట్ లో నిలిచింది. ఈ సినిమా 100 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 800 కోట్లు కలెక్ట్ చేసింది. మన తెలుగులో అయితే ఆ రేంజ్ లో ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాలు లేవు. కేవలం సంక్రాంతికి వస్తున్నాం సినిమా 100 కోట్లతో తీస్తే 300 కోట్లు కలెక్ట్ చేసి 200 శాతం ప్రాఫిట్స్ చూసింది. కోర్ట్ సినిమా కూడా 10 కోట్లతో తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసి 400 శాతం ప్రాఫిట్స్ చూసింది. ఇంకే తెలుగు సినిమా 100 శాతం ప్రాఫిట్ కూడా చూడలేకపోయింది. ఇవన్నీ థియేటర్ కలెక్షన్స్, సినిమా బడ్జెట్ ఆధారంగా వచ్చిన లాభాలు మాత్రమే. మరి 2025 సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు భారీ లాభాలు ఆర్జిస్తాయేమో చూడాలి.