Vishwambhara : ‘విశ్వంభర’ షూట్ ఇంకా అవ్వలేదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది.. మిగిలిన షూట్ ఎప్పట్నుంచి..

తాజాగా విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఈ సినిమా షూట్ ఇంకా అవ్వలేదని చెప్పి షాక్ ఇచ్చాడు.

Vishwambhara : ‘విశ్వంభర’ షూట్ ఇంకా అవ్వలేదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది.. మిగిలిన షూట్ ఎప్పట్నుంచి..

Vishwambhara

Updated On : July 18, 2025 / 1:45 PM IST

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే దీనికంటే ముందు మొదలుపెట్టిన విశ్వంభర సినిమా షూట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అని ఇన్నాళ్లు అనుకుంటున్నారు. తాజాగా విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఈ సినిమా షూట్ ఇంకా అవ్వలేదని చెప్పి షాక్ ఇచ్చాడు.

విశ్వంభర డైరెక్టర్ వశిష్ట ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా షూట్ గురించి మాట్లాడుతూ.. విశ్వంభర షూట్ ఇంకా పూర్తవ్వలేదు. ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే రెండు రోజులు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 25 నుంచి ఆ షూట్ జరుగుతుంది. స్పెషల్ సాంగ్ కోసం ఏ సాంగ్ ని రీమిక్స్ చెయ్యట్లేదు. ఫ్రెష్ సాంగ్ తీసుకుంటున్నాము. VFX వల్లే సినిమా కాస్త లేట్ అవుతుంది అని తెలిపారు.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ కథ ఇదే.. మొత్తం లీక్ చేసేసిన దర్శకుడు .. అలా ఎలా చెప్పావు బ్రో..

దీంతో అనిల్ రావిపూడి సినిమా షూట్ మధ్యలో చిరంజీవి సాంగ్ కోసం విశ్వంభర షూట్ కి వస్తారని తెలుస్తుంది. ఈ లెక్కన ఈ నెలలోనే విశ్వంభర షూట్ పూర్తయితే ఇక పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు పూర్తవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.