Hari Hara Veeramallu : నార్త్ ఇండియన్ పవన్ ఫ్యాన్స్ కి నిరాశే.. ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంట.. కానీ..
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో సౌత్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, నార్త్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని వార్తలు వచ్చాయి.

Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : గత అయిదేళ్లుగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు జులై 24న రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ కేవలం హీరోయిన్, నిర్మాత మాత్రమే చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండటంతో సౌత్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, నార్త్ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారని వార్తలు వచ్చాయి. నార్త్ లో పవన్ కి పొలిటికల్ గా భారీగా ఫ్యాన్స్ ఏర్పడ్డ సంగతి తెలిసిందే. మోదీ సైతం పవన్ ని తుఫాన్ అని అభివర్ణించడం, కేంద్ర మంత్రులు సైతం పవన్ కి ప్రాధాన్యత ఇవ్వడం, సనాతన ధర్మం కోసం పవన్ పోరాడటంతో నార్త్ లో పవన్ కి పొలిటికల్ గా ఫ్యాన్స్ బాగానే ఏర్పడ్డారు. దీంతో కాశీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని, యోగి ఆదిత్యనాథ్ వస్తారని వార్తలు వచ్చాయి.
Also Read : Shah Rukh Khan : షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ బాద్‌షా.. ఆందోళనలో అభిమానులు
ఇటీవల జులై 21 సోమవారం నాడు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని ప్రకటిచారు మూవీ యూనిట్. నార్త్ ఈవెంట్ పై క్లారిటీ రాలేదు. నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడగా నార్త్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
ఏఎం రత్నం మాట్లాడుతూ.. నార్త్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరో లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే బాగోదు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టట్లేదు. ఒక ప్రెస్ మీట్ మాత్రం ముంబైలో పెట్టే ఆలోచన చేస్తున్నాము అని తెలిపారు. దీంతో నార్త్ లో పవన్ వెళ్తాడు, అక్కడ పవర్ ఫుల్ గా మాట్లాడతాడు అని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. మరి ఇక్కడ హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడో చూడాలి.
Also Read : OG : టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఓజీ? 1000 కోట్లు..?