HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి విలన్ తో కొత్త పోస్టర్..

నేడు మరోసారి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

pawan harihara veeramallu

HariHara VeeraMallu : గత అయిదేళ్లుగా పవన్ రాజకీయ బిజీ వల్ల సాగుతూ వచ్చిన హరిహర వీరమల్లు షూటింగ్ ని ఇటీవల ఎట్టకేలకు పూర్తి చేసి జూన్ 12 రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషించారు. ఈ సినిమా విడుదలవుతుందని ఎదురుచూసారు. ప్రమోషన్స్ చేసి, సాంగ్స్ రిలీజ్ చేయడంతో జూన్ 12 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వస్తుందనుకున్నారు.

కానీ చివరి నిమిషంలో హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా అని ప్రకటించడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయిదేళ్లుగా ఎదురుచూస్తున్న సినిమా వచ్చేస్తుంది అనుకునేలోపు VFX పనులు ఇంకా అవ్వలేదని మరోసారి వాయిదా పడటంతో ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

నేడు మరోసారి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని జులై 24 నరిలీజ్ చేయనున్నారు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది. మరి ఈసారైనా చెప్పిన డేట్ కి రిలీజ్ చేస్తారా? మరోసారి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా చూడాలి. పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ తో వేరే సినిమా రిలీజ్ డేట్స్ కూడా మారుతూ వస్తున్నాయి. మరి ఈ సినిమా ఇప్పుడు చెప్పిన డేట్ కి వస్తే మిగతా సినిమాలు కూడా తర్వాత క్యూ కట్టే అవకాశం ఉంది.

 

జులై 25 విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రిలీజ్ కానుంది. మరి హరిహర వీరమల్లు సినిమా జులై 24 రిలీజ్ చేయడంతో ఈ సినిమాని వాయిదా వేస్తారా లేక పవన్ కి పోటీగా దించుతారా చూడాలి. కింగ్డమ్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.