HariHara VeeraMallu : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా.. డేట్, ప్లేస్ ఎక్కడంటే..? ట్రైలర్ కూడా ఆ రోజే..

హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తుంది.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Pre Release Event

HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 న రిలీజ్ కి రెడీ అయింది. అయిదేళ్లుగా సాగి ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ ఉండటంతో మూవీ యూనిట్ సింపుల్ గా ప్రమోషన్స్ చేస్తుంది. అయితే సౌత్ లో ఒకటి, నార్త్ లో ఒకటి రెండు భారీ ఈవెంట్స్ ని పెట్టాలని ముందే ప్లాన్ చేసారు.

ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని SV యూనివర్సిటీ తారకరామ క్రీడా మైదానంలో జూన్ 8న సాయంత్రం నిర్వహించనున్నారు అని సమాచారం. ఇప్పటికే స్థలం పర్మిషన్ కోసం పోలీసులకు దరాఖాస్తు కూడా చేశారని తెలుస్తుంది.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా? చివరి నిమిషంలో ఫ్యాన్స్ కి షాక్ ఇస్తారా?

ఈ మేరకు జూన్ 7 రాత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకొని 8 ఉదయం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే హరిహర వీరమల్లు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక నార్త్ లో కాశీలో హరిహర వీరమల్లు ఈవెంట్ నిర్వహిస్తారని టాక్ వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంటే హరిహర వీరమల్లు వాయిదా పడుతుంది అని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి జూన్ 12 సినిమా రిలీజ్ అవుతుందా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా చూడాలి.

Also Read : Kamal Haasan : కోర్టు చెప్పినా వినని కమల్ హాసన్.. ఆగిపోయిన ‘థగ్‌ లైఫ్’ సినిమా రిలీజ్.. కర్ణాటకలో ‘కమల్ కన్నడ’ రగడ..