Pawan Kalyan : హరీష్, సుజిత్ సినిమాలు కంటే ముందే వినోదయ సిత్తం.. షూటింగ్ మొదలు కానుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే హరీష్, సుజిత్ సినిమాలు పూజ కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందే వినోదయ సిత్తం పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.

pawan kalyan vinodhaya sitham

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి షూటింగ్ జరుపుకుంటుంది. మిగిలిన మూడు ప్రకటన దశలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు హరీష్ శంకర్ – ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ – OG, తమిళ రీమేక్ వినోదయ సిత్తం. ఇప్పటికే హరీష్, సుజిత్ సినిమాలు పూజ కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కంటే ముందే వినోదయ సిత్తం పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.

Pawan Kalyan : అడిగినంత ఇవ్వరు.. సినిమా రెమ్యునరేషన్స్ గురించి బయటపెట్టిన పవర్ స్టార్..

వినోదయ సిత్తం ఒక ఫాంటసీ కామెడీ డ్రామా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. ‘గోపాల గోపాల’ మూవీలో కనిపించినట్లు మరోసారి మోడరన్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో మెయిన్ లీడ్ మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. పవన్ పాత్ర కొంత సమయం మాత్రమే ఉంటుంది. దీంతో పవన్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకు సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 14న నుంచి వినోదయ సిత్తం సెట్ లోకి పవన్ అడుగు పెట్టబోతున్నాడు అని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా తమిళంలో వినోదయ సిత్తం తెరకెక్కించిన సముద్రఖని నే తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ‘హరిహర వీరమల్లు’ విషయానికి వస్తే.. చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ సమ్మర్ లో కచ్చితంగా రిలీజ్ చేస్తాము అంటున్నారు మేకర్స్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్, నర్గీస్ ఫఖ్రీ, విక్రంజీత్ విర్క్ వంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.