Anil Ravipudi: జన నాయగన్ కోసం నన్ను అడిగారు.. నేను చేయనని చెప్పాను.. అనిల్ షాకింగ్ కామెంట్స్

విజయ్ జన నాయగన్ సినిమా రీమేక్ పై దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Anil Ravipudi: జన నాయగన్ కోసం నన్ను అడిగారు.. నేను చేయనని చెప్పాను.. అనిల్ షాకింగ్ కామెంట్స్

Director Anil Ravipudi interesting comments about Jana nayagan movie remake.

Updated On : January 11, 2026 / 6:53 PM IST
  • జన నాయగన్ మూవీపై అనిల్ ఆసక్తికర కామెంట్స్
  • విజయ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన అనిల్ రావిపూడి
  • స్ట్రైట్ మూవీ చేస్తానని చెప్పాడట

Anil Ravipudi: తమిళ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా జన నాయగన్ సినిమా వస్తోంది. దీంతో, తెలుగులో కూడా మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి ఈ సినిమాపై. ఇక పిలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ చేస్తున్న చివరి సినిమా కావడంతో తమిళ ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Riddhi Kumar: రాజాసాబ్ బ్యూటీ రిద్ది కుమార్.. రెడ్ డ్రెస్సులో గ్లామర్ షో.. ఫొటోలు

కానీ, అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, తాజాగా జన నాయగన్ రీమేక్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు భగవంత్ కేసరి దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. ‘జన నాయగన్ సినిమా గురించి విజయ్ గారు నన్ను అడిగారు.

ఆ సినిమాను నన్ను డైరెక్ట్ చేయమని కూడా అడిగారు. ఎందుకంటే, ఆయనకు భగవంత్ కేసరి సినిమాపై చాలా నమ్మకం ఉంది. కానీ, నేను రీమేక్ కాదని స్ట్రైట్ సినిమా చేస్తానని చెప్పాను. కారణం ఏంటంటే, ఇది విజయ్ గారికి చివరి సినిమా. అందుకే రిమేక్ అంటే భయం వేసింది. అందుకే ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే ధైర్యం చేయలేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.