Pawan Kalyan
Pawan Kalyan : బుధవారం నాడు పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సచిన్, ఐశ్వర్య రాయి, నారా లోకేష్.. ఇలా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది.(Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సీగల్ దాదాపు 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మరీ నేను బాబా గారిని కలవాలి అన్నారు. బెంగుళూరుకు వచ్చి అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చి బాబాగారి ఆశీస్సులు తీసుకున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈయన గురించి అక్కడిదాకా వెళ్ళింది అనుకునేవాడిని. వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇలాంటి జన్మ తీసుకున్నారు అంటే మహానుభావుడు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అభివృద్ధికి పాటుపడ్డారు అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Director Saailu : సినిమా హిట్ అవ్వకపోతే కట్ డ్రాయర్ మీద పరిగెడతా.. డైరెక్టర్ ఛాలెంజ్..
స్టీవెన్ సీగల్ ఒకప్పటి హాలీవుడ్ స్టార్ యాక్షన్ హీరో. డైరెక్టర్, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కూడా. 1988 నుంచి 2019 వరకు ఎన్నో సినిమాలతో మెప్పించాడు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఆయన ఇండియాకు అనేకసార్లు వచ్చాడు. ఇండియాలో ఉన్న పలువురు గురువులను కలిసాడు. బాలీవుడ్ లో కూడా స్టీవెన్ సీగల్ కు సన్నిహితులు ఉన్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి బాబాని చిరంజీవి ద్వారా కలిశారు. చిరంజీవి సత్య సాయి బాబా, స్టీవెన్ సీగల్ ఒకే స్టేజిపై కూర్చున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.