×
Ad

Pawan Kalyan : రాజకీయాల్లో బద్ద శత్రువులు.. OG సినిమాలో క్యారెక్టర్ అంటే.. ఆ కండిషన్ పెట్టిన పవన్ కళ్యాణ్..

ఇంత జరిగాక ఈ ఇద్దరూ కలిసి నటిస్తారని ఎవరూ అనుకోలేదు. కట్ చేస్తే..(Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : రాజకీయాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ శత్రువులుగా మారతారు. కానీ అందులో చాలా మంది బయట కనిపిస్తే మామూలుగానే మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. పవన్ – ప్రకాష్ రాజ్ బయట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు, రాజకీయాల పరంగా ప్రత్యర్థులే. ఇక ప్రకాష్ రాజ్ అయితే పనేలేదన్నట్టు తన ట్వీట్స్ తో ఎప్పుడూ పవన్ పై దాడి చేయడానికి రెడీగా ఉంటారు. దీంతో పవన్ కూడా మీడియా ముందే ప్రకాష్ రాజ్ పై ఫైర్ అవుతారు.(Pawan Kalyan)

ఇంత జరిగాక ఈ ఇద్దరూ కలిసి నటిస్తారని ఎవరూ అనుకోలేదు. కట్ చేస్తే ఇటీవల వచ్చిన OG సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. పవన్ కళ్యాణ్ హీరో అయితే ప్రకాష్ రాజ్ ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఇద్దరికీ మంచి అనుబంధం ఉన్న పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక వీరి గురించి తెలిసిన వాళ్ళు రాజకీయాలు వేరు సినిమా వేరు అని అనుకున్నారు. తాజాగా OG సక్సెస్ మీట్ జరగ్గా ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also See : OG Success Meet : ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సక్సెస్ మీట్.. ఫొటోలు..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు నటించారు. మొదట ఆయన్ని తీసుకుంటున్నాం మీకేమైనా ఇబ్బందా అని అడిగారు. నాకు ఎవరితోనూ ఇబ్బంది ఉండదు. నా పొలిటికల్ అభిప్రాయాలు బలంగా ఉంటాయి. అలాగే ఎవరి అభిప్రాయాలూ వాళ్లకు ఉంటాయి. అందులో తప్పేమి లేదు. ఒక్కోసారి పర్సనల్ అవుతుంది. అంతేకాని అది సినిమాల్లోకి తీసుకురాకూడదు. నేను సినిమాకి గౌరవం ఇస్తాను. ఎందుకంటే రాజకీయంగా మేము విరోధులం కావొచ్చు అలాంటిది మమ్మల్ని కలిసి నటించేలా చేసింది సినిమా. అందుకే ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఒకటే చెప్పాను.

అనవసరంగా షూటింగ్ సెట్ లో పాలిటిక్స్ మాట్లాడొద్దు, ఆ టాపిక్స్ డిస్కషన్స్ పెట్టొద్దు అని చెప్పండి అన్నాను. అలాంటివి మాట్లాడితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. ఆయన ప్రొఫెషనల్ గా ఉంటే నేను ప్రొఫెషనల్ గా ఉంటాను. ఆయన మంచి యాక్టర్. మా మధ్య ఏవైనా ఉంటే బయట మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ కాదు అని అన్నారు. దీంతో పవన్ ని అంతా అభినందిస్తున్నారు. సినిమా సినిమానే రాజకీయాలు రాజకీయాలే దేన్నీ కలపకుండా నటుడిగా ప్రకాష్ రాజ్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు పవన్ అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

Also See : Pawan Kalyan : OG సక్సెస్ మీట్.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్.. ఇక్కడ చూసేయండి..