×
Ad

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో జాయిన్ అయిన పవన్.. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు..

'హరిహర వీరమల్లు' షూటింగ్ లో జాయిన్ అయిన పవన్

  • Published On : November 30, 2024 / 02:02 PM IST

Pawan Kalyan joined the shooting of Harihara Veeramallu movie

Hari Hara Veera Mallu : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. కొంతకాలం సినిమాలకి కూడా బ్రేక్ ఇచ్చాడు పవన్. రాజకీయాల కోసం సినిమాలను పూర్తిగా మానేయకుండా తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చెయ్యాలనుకున్నాడు. అలా ఆయన ఒప్పుకున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి.

Also Read : Taraka Rama Rao : ‘కొత్త ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా.. వీనా రావు ఫోటోలు చూసారా..

అయితే ఇప్పటివరకు ఆయన ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న డౌట్ అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఇటీవల దీని షూటింగ్ చివరి షెడ్యూల్ కి చేరిందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే చివరి షెడ్యూల్ లో పవన్ సైతం జాయిన్ కానున్నారని తెలిపారు.

తాజాగా పవన్ హరిహర వీరమల్లు సినిమా చివరి షెడ్యూల్ లో జాయిన్ అయినట్టు తనకి సంబందించిన ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’.. అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసి దాదాపుగా మూడు ఏళ్లు అవుతుంది. ఇప్పటికి పూర్తికావస్తోంది.మార్చి 28, 2025 లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. దర్శకుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మేఘా సూర్య ప్రొడక్షన్‌పై ఏఎంరత్నం, ఏ దయాకర్‌ రావు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి.