Taraka Rama Rao : ‘కొత్త ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ హీరోయిన్ ఎవరో తెలుసా.. వీనా రావు ఫోటోలు చూసారా..
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి.

Veena Rao Ane Nenu Taraka Rama Rao first movie heroine video goes viral
Taraka Rama Rao : ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి సూపర్ హిట్ సినిమాలను అందించారు. అయితే ఈ డైరక్టర్ ఇప్పుడు ఓ నందమూరి హీరోతో సినిమా చేస్తున్నారు.
Also Read : Samantha : సిటాడెల్ సిరీస్ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో సందడి చేసిన సమంత.. ఫొటోలు చూశారా?
ఆయన మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు. ఈ యంగ్ హీరోతో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను న్యూ ట్యాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన భార్య గీత నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా వీనా రావును పరిచయం చేశారు. ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయి. అంతేకాదు కూచిపూడి డ్యాన్సర్ కూడా.
అయితే ఈ సినిమా హీరోయిన్ గా చేస్తునందుకు వీణా రావు స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఆ వీడియోకి ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగులో వాయిస్ అందించింది.” వీనా రావు అనే నేను.. ఊహ తెలిసినప్పటి నుండి నటనపై ఇష్టంతో వైవిఎస్ చౌదరి దగ్గర గత 18 నెలలుగా ట్రైనింగ్ తీసుకుకొని ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాను అని.. మన సినీ ఇండస్ట్రీ పట్ల నిజమైన విశ్వాసంతో, విధేయత చూపుతానని ప్రమాణం చేస్తున్నాని” ఆ వీడియోలో తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.