×
Ad

Pawan Kalyan: దయచేసి ఫ్యాన్స్ వార్స్ కోసం సినిమాలను చంపేయకండి.. హీరోల అభిమానులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

మేము ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మీకు తెలీదు. కుటుంబాలకు దూరంగా ఉంటాము. ఇంటికి కూడా వెళ్లం. కొంతమంది అవసరం కోసం చేస్తాం.

Pawan Kalyan: అందరు హీరోల అభిమానులకు సినీ నటుడు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ వార్స్ కోసం సినిమాలను చంపేయకండి అని పవన్ రిక్వెస్ట్ చేశారు. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఓజీ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఫ్యాన్స్ వార్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఫ్యాన్స్ వార్స్ ఆపేయాలని కోరారు.

”నేను సినిమా కంటే పెద్దది చేస్తున్నా. నేను చేస్తున్నది పాలిటిక్స్. టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ తో గొడవపడటం అన్నీ ఈజీ. రియల్ లైఫ్ లో అలా ఉండదు. తల ఎగిరిపోవచ్చు కూడా. ఐ లవ్ ఫర్ మై నేషన్. నా దేశం అంటే నాకు పిచ్చి. అందరు హీరోల అభిమానులను నేను కోరుకునేది ఒక్కటే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్, నాని ఏ హీరో అయినా, ఏ లాంగ్వేజ్ హీరో అయినా.. వర్క్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తా. నేను ఆర్ట్ ని ప్రేమించే వాడిని. ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడు అంటే మనసు సరిగా లేదని అర్థం.

అలాంటి ఆలోచనలు నాకు లేవు. నా అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులను నేను కోరుకునేది ఒక్కటే.. ఫ్యాన్స్ వార్స్ స్టాప్ చేయండి. స్టాప్ డూయింగ్ ఫ్యాన్ వార్స్. మేము ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మీకు తెలీదు. కుటుంబాలకు దూరంగా ఉంటాము. ఇంటికి కూడా వెళ్లం. కొంతమంది అవసరం కోసం చేస్తాం.

ఈ ఫ్యాన్ వార్స్ లో దయచేసి సినిమాను చంపేయకండి. సినిమాకి షార్ట్ లైఫ్ అయిపోయింది. ఇంతకుముందు 100 రోజులు 150 రోజులు చేసుకుంటే ఫంక్షన్ చేసుకునే వారు. ఇప్పుడు 6 రోజులకే అయిపోయింది. దయచేసి ఫ్యాన్ వార్స్ ఆపేయండి. ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకుందాం. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే సమాజంలో అగ్లీనెస్ పెరిగిపోతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు. మీ అందరికి ఇది నా రిక్వెస్ట్. మీరు ఎంత మారతారో లేదో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. అందరు హీరోల అభిమానులను నేను గౌరవిస్తాను. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: నా కొడుకు అకీరా ఆ బుక్‌ను చాలా ఆసక్తికరంగా చూశాడు.. జెన్‌ జీలను ఆకట్టుకునే డైరెక్టర్‌ సుజీత్‌: పవన్ కల్యాణ్