నా కొడుకు అకీరా ఆ బుక్‌ను చాలా ఆసక్తికరంగా చూశాడు.. జెన్‌ జీలను ఆకట్టుకునే డైరెక్టర్‌ సుజీత్‌: పవన్ కల్యాణ్

"సుజీత్ అప్పటికే ప్రభాస్‌తో సినిమా తీశారు. సుజీత్ నాకు ఏదో చెబుతున్నాడు కానీ, భావం అంతలా చెప్పలేకపోతున్నారు. సుజీత్‌లో ఏదో ఉందని తెలిసింది" అని అన్నారు.

నా కొడుకు అకీరా ఆ బుక్‌ను చాలా ఆసక్తికరంగా చూశాడు.. జెన్‌ జీలను ఆకట్టుకునే డైరెక్టర్‌ సుజీత్‌: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : October 1, 2025 / 10:18 PM IST

హైదరాబాద్‌లో ఇవాళ ఓజీ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.

చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతాయని, ఈ సినిమా ఓ సెలబ్రేషన్స్‌లా రిలీజ్ అయిందని పవన్ తెలిపారు. అలాంటి అరుదైన అవకాశం తమకు లభించిందని, ప్రేక్షకులకు, అభిమానులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా వచ్చిందని అన్నారు.

సుజీత్, తమన్‌తో పాటు ఈ సినిమా యూనిట్ అందరికీ పవన్ థ్యాంక్స్‌ చెప్పారు. “స్టోరీ టెల్లింగ్ చాలా గొప్ప కళ. చాలా మంది సమష్ఠిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు.

ప్రతి సినిమాకు ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒక్కోసారి మంచి ఫలితాలు వస్తాయి.. ఒక్కోసారి రావు. సుజీత్‌లో నాకు నేను కనిపిస్తాను. ఇదో ఆసక్తికర ప్రయాణం నాకు.

సుజీత్ ఈ కథను నాకు ఇప్పటివరకు చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ నా వద్దకు ఎలా వచ్చిదంటే.. యంగ్‌ డైరెక్టర్స్‌తో మాట్లాడుతుంటే సుజీత్ ప్రస్తావన వచ్చింది. సుజీత్‌ నాకు 5 నిమిషాల్లో విజువల్ ఫ్లో, బుక్ చూపించారు. అందులో సమురాయ్ కథ, జపనీస్‌ డ్రెస్, గ్యాంగ్‌స్టర్స్‌ పట్టుకున్న తుపాకులు ఉన్నాయి. డైలాగులు లేవు, విజువల్స్‌ ఉన్నాయి. 5 రోజుల తర్వాత వచ్చి ఈ విషయాలనే పెంచి చెప్పారు.

నా కొడుకు అకీరా ఆ బుక్‌ను చాలా ఆసక్తికరంగా చూశాడు. చాలా బాగుంది అని అన్నాడు. నాకు అర్థం కాలేదు. జెన్‌ జీలను ఆకట్టుకునే డైరెక్టర్‌ సుజీత్‌. సుజీత్ అప్పటికే ప్రభాస్‌తో సినిమా తీశారు. సుజీత్ నాకు ఏదో చెబుతున్నాడు కానీ, భావం అంతలా చెప్పలేకపోతున్నారు. సుజీత్‌లో ఏదో ఉందని తెలిసింది” అని అన్నారు. ఒక విజువల్‌తో సుజీత్‌ సినిమాను స్టార్ట్‌ చేశారని, ప్రేక్షకుల్లోకి కథను తీసుకెళ్లారని ప్రశంసల జల్లు కురిపించారు.