Shah Rukh Khan : వామ్మో.. హాలీవుడ్ సెలబ్రిటీలను మించి రిచ్ అయిన షారుఖ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులో తెలుసా?

బాలీవుడ్ లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచాడు. (Shah Rukh Khan)

Shah Rukh Khan : వామ్మో.. హాలీవుడ్ సెలబ్రిటీలను మించి రిచ్ అయిన షారుఖ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులో తెలుసా?

Shah Rukh Khan

Updated On : October 1, 2025 / 5:58 PM IST

Shah Rukh Khan : కేవలం వ్యాపారవేత్తలు కాదు సినిమా సెలబ్రిటీలు కూడా బాగానే సంపాదిస్తారు, ఆస్తులు కూడబెడతారు. తాజాగా ది హురున్ ఇండియా అనే సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి పలు విభాగాల్లో రిచెస్ట్ పర్సన్స్ ని, సంస్థలను ప్రకటించింది. ఇందులో బాలీవుడ్ లో కూడా రిచ్ పర్సన్స్ ని ప్రకటించింది.(Shah Rukh Khan)

బాలీవుడ్ లో టాప్ రిచెస్ట్ సెలబ్రిటీగా స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిలిచాడు. 1.4 బిలియన్ డాలర్స్ అంటే దాదాపు 12 వేల 490 కోట్ల విలువ చేసే ఆస్తులతో షారుఖ్ ఈ లిస్ట్ లో టాప్ లో నిలిచాడు. షారుఖ్ కేవలం సినిమాలో నటిస్తూ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా యాడ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ, కోల్ కత్తా నైట్ రైడర్స్ లో భాగం, కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక టీమ్ లో వాటా, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వాటాదారుడిగా సంపాదిస్తున్నాడు. ఈ బిజినెస్ లతో షారుఖ్ ఆస్తుల విలువ ఈ రేంజ్ కి పెరిగింది.

Also Read : Raviteja : వరుస గాయాలు.. సర్జరీ.. పాపం రవితేజకు ఇంత జరిగిందా? అందుకే ఆలస్యం..

గత కొన్నాళ్లుగా షారుఖ్ టాప్ రిచెస్ట్ బాలీవుడ్ లిస్ట్ లో ఉంటున్నాడు కానీ తాజాగా నెంబర్ 1 పొజిషన్ కి చేరుకున్నాడు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుంచి జుహీ చావ్లా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే షారుఖ్ నెట్ వర్త్ ఏకంగా కొంతమంది హాలీవుడ్ సెలబ్రిటీలను మించిపోయింది.

హాలీవుడ్ సింగర్ టేలర్ స్విఫ్ట్(1.3 బిలియన్ డాలర్స్), నటుడు ఆర్నాల్డ్(1.2 బిలియన్ డాలర్స్), నటి సెలెనా గోమెజ్, టామ్ క్రూజ్(600 మిలియన్ డాలర్స్).. ఇలా చాలా మంది హాలీవుడ్ స్టార్స్ కంటే షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఎక్కువ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ లిస్ట్ తో బాలీవుడ్ లోనే కాదు వరల్డ్ లోనే రిచెస్ట్ నటుడిగా షారుఖ్ నిలిచాడు.

Also See : Manchu Manoj : భార్యతో కలిసి అస్సాం కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన మంచు మనోజ్.. ఫొటోలు..