Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ నుంచి పవన్ లుక్ లీక్.. వైరల్ అవుతున్న ఫోటో!

ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ లుక్ లీక్ అయ్యింది. ఆ ఫొటోలో పవన్ లుంగీ కట్టులో, గడ్డంతో..

Pawan Kalyan look leak from Ustaad Bhagat Singh sets

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోకి అడుగు పెట్టాడు. హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పవన్ ఈ సినిమాకి 50 రోజులు కాల్ షీట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

Pawan Kalyan : అకీరా బర్త్ డే రోజు రేణుదేశాయ్‌ని బాధ పెట్టిన పవన్ ఫ్యాన్స్.. మరి అలంటి కామెంట్స్?

ఆ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టులో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ చుసిన పవన్ అభిమానులు.. మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టిఇంటే వైరల్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. శ్రీలీల ఒక హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అంటూ టాక్ వినిపిస్తున్నా, దాని పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ ని పెట్టి పవన్ కళ్యాణ్ అని మోసం చేస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై అభిమానులు ఫైర్..

పవన్ మే నెల చివరి నాటికి ఉస్తాద్ షూటింగ్ పూర్తి చేసి హరి హర వీరమల్లు (Hari Hara Veear Mallu) షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేశాడట. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఆ చిత్రం చివరి దశ చిత్రీకరణలో ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పవన్ పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నాడు.