Site icon 10TV Telugu

Pawan Kalyan : అల్లు అర్జున్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఫొటోలు వైరల్..

Pawan Kalyan Meets Allu Arjun after Allu Kanakaratnam Passed Away

Pawan Kalyan

Pawan Kalyan : నిన్న అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి అత్తమ్మ కావడంతో అల్లు, మెగా కుటుంబాలు రెండూ విషాదంలో మునిగాయి. నిన్న అంతా చిరంజీవి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండి అన్ని చూసుకున్నారు. నిన్నే సినీ పరిశ్రమ ప్రముఖులు అంతా వచ్చి ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను ఓదార్చారు.(Pawan Kalyan)

అయితే నిన్న పవన్ కళ్యాణ్ కి వైజాగ్ లో జనసేన బహిరంగ సభ ఉండటంతో అది అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ని, అల్లు అరవింద్ ని పరామర్శించారు. అల్లు కనకరత్నమ్మ ఫొటోకు నివాళులు అర్పించారు పవన్. దీంతో పవన్ కళ్యాణ్ బన్నీ తో మాట్లాడిన ఫొటోలు నేడు వైరల్ గా మారాయి.

Also See : Sena tho Senani : సేనతో సేనాని.. వైజాగ్ జనసేన భారీ బహిరంగ సభ.. ఫొటోలు..

గత ఎన్నికల సమయం నుంచి పవన్ – అల్లు అర్జున్ మధ్య విబేధాలు ఉన్నట్టు అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీ కూడా తన ఫ్రెండ్ అని వైసీపీ నాయకుడికి సపోర్ట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు బన్నీపై విమర్శలు చేసారు. అప్పట్నుంచి బన్నీ – మెగా ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. మరి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళు ఒకటే అని, అందరూ బాగుంటారు, వారి మధ్య విబేధాలు లేవు అని ఫ్యాన్స్ అర్ధం చేసుకొని ఫ్యాన్ వార్స్ ఆపుతారేమో చూడాలి.

 

 

Exit mobile version