Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. అందుబాటులో లేని డిప్యూటీ సీఎం.. ఎక్కడున్నారో తెలుసా..
ఈసారి పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు నాడు అందుబాటులో లేరు. (Pawan Kalyan)
- Saketh U
- Published on- September 2, 2026 / 06:57 AM IST
Pawan Kalyan
Pawan Kalyan : నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు, జనసైనికులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన పుట్టిన రోజుని ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారని తెలిసిందే. ఆయన ఇంటికి లేదా కార్యాలయానికి అనేకమంది అభిమానులు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. పవన్ కూడా జనసేన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు నాడు అభిమానులకు, కార్యకర్తలకు అందుబాటులో లేరు.
పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి ఆయుర్వేద చికిత్స కోసం వారం రోజుల ముందే కేరళ వెళ్లిన సంగతి తెలిసిందే. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స చేయించుకుంటున్నారు. నెల రోజులు పాటు ఈ చికిత్స అందివ్వనున్నారు. పవన్ కళ్యాణ్ నేడు తన పుట్టిన రోజు నాడు కూడా అక్కడే ఆయుర్వేద వైద్యశాలలోనే ఉన్నట్టు సమాచారం.
Also Read : Anna Konidala : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. స్పెషల్ ఫోటో షేర్ చేసి విషెష్ చెప్పిన భార్య అన్నా కొణిదెల..
దీంతో నేడు జరగవలసిన జనసేన కార్యక్రమాలు ఆన్లైన్ లో జరగనున్నాయి. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ కి లోకల్ జనసేన లీడర్లు అధ్యక్షత వహించనున్నారు. పవన్ కేరళలో ఉన్నారని తెలియడంతో అక్కడ ఉన్న తెలుగు ప్రజలు, కేరళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే NIT కాలికట్ లో 300 మంది విద్యార్థులు ఆయన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. పవన్ ఇంకా చికిత్స తీసుకుంటుండటంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసైనికులు కోరుకుంటున్నారు.
#HBDJanaSenaniPawanKalyan #Kerala #GenZ
Kerala Gen-Z stands with JanaSena & Pawan Kalyan!
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.… pic.twitter.com/GJGwtJJsGN
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2026
