×
Ad

OG Comic Book : OG కామిక్ బుక్ రివ్యూ.. ఓజి ప్రీక్వెల్ మొత్తం కథ ఇదే.. జపాన్, సుభాష్ చంద్రబోస్ బ్యాక్ డ్రాప్ కథతో.. అదిరిపోయిందిగా..

ఈ కామిక్ బుక్ లో ఓజి ప్రీక్వెల్ కథ పవర్ ఫుల్ ఫొటోలతో చెప్పేసారు. దీంతో OG సినిమా కామిక్ బుక్ లో చూపించిన కథ వైరల్ గా మారింది. (OG Comic Book)

OG Comic Book

OG Comic Book :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ సంవత్సరం తెలుగు హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది. ఓజి సినిమాతో, సినిమాలో పవన్ లుక్స్, సినిమా ప్రమోషన్స్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ కూడా ప్రకటించారు. వాటికి జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఇంకా పెద్ద కథ ఉన్నట్టు, సుభాష్ చంద్రబోస్ కి లింక్ ఉన్నట్టు.. డైరెక్టర్ సుజీత్ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.(OG Comic Book)

ఆ సినిమాలు వచ్చేలోపు OG సినిమాకు ముందు జరిగిన కథతో ఓ కామిక్ బుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ బుక్ రిలీజ్ చేయగానే బుక్ లవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG కామిక్ బుక్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నారు. ఈ బుక్ ఇప్పుడు అందరికి అందింది. ఈ కామిక్ బుక్ లో ఓజి ప్రీక్వెల్ కథ పవర్ ఫుల్ ఫొటోలతో చెప్పేసారు. దీంతో OG సినిమా కామిక్ బుక్ లో చూపించిన కథ వైరల్ గా మారింది.

ఈ OG కామిక్ బుక్ కథ ఏంటంటే..

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ వాళ్ళతో పోరాడటానికి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని తమ ఆర్మీగా తీసుకెళ్తారు. అలా వెళ్లినవాళ్ళల్లో జై(పవన్ కళ్యాణ్) ఒకరు. బ్రిటిష్ అధికారి విన్ స్టన్ నాయకత్వంలో అనేకమంది ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ వాళ్ళ తరపున సముద్రం మార్గంలో జపాన్ వెళ్లి అక్కడ యుద్ధం చేస్తారు. అయితే క్రూరుడైన విన్ స్టన్ కొంతమంది ఇండియన్స్ సరిగ్గా యుద్ధం చేయట్లేదని వాళ్ళని చంపేస్తాడు. దీంతో జై కి కోపం వచ్చి విన్ స్టన్ ని చంపేస్తాడు. ఈ దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు షాక్ అవుతారు.

దీంతో ఇండియన్ ఆర్మీ లీడర్ మోహన్ సింగ్, జై జపాన్ లీడర్స్ తో మాట్లాడి ఆ యుద్ధం అప్పటికి సంధి చేసుకొని బ్రిటిష్ వాళ్ళు, ఇండియన్ ఆర్మీ తిరిగి ఇండియాకు బయలుదేరుతారు. ఓడలో ప్రయాణిస్తుండగా ఇండియన్ ఆర్మీలో ఉన్న ఓ బ్రిటిష్ గూఢచారి జై బ్రిటిష్ వాళ్లకు గూఢచారి అని, ద్రోహి అని అబద్దం చెప్పి అతన్ని కాల్చి సముద్రంలో పడేసి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. జై సముద్రంలో కొట్టుకొచ్చి జపాన్ లోని షిన్ డెన్స్ కి సంబంధించిన ఓ గ్రామంలో పడతాడు. ఆ గ్రామం వాళ్ళు అతన్ని కాపాడతారు.

అయితే అతని దగ్గర హొంజో అనే పవర్ ఫుల్ కటానా ఉండటం చూస్తారు. ఆ కటానాకు పెద్ద చరిత్రే ఉంటుంది. అది షిన్ డెన్ వాళ్లదే. ఆ కటానా అక్కడికి వచ్చిందని తెలిసి దాని కోసం బ్లాక్ డ్రాగన్స్ షిన్ డెన్స్ మీదకు యుద్దానికి వస్తారు. చికిత్స తీసుకుంటున్న జై మెలుకువ వచ్చి తనని కాపాడిన షిన్ డెన్స్ కోసం ఆ కటానాతో పోరాడి బ్లాక్ డ్రాగన్స్ లో కొంతమందిని, బ్లాక్ డ్రాగన్స్ హెడ్ కొజిమాని అంతమొందించి, మిగిలిన వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేస్తారు. దీంతో ఆ కటానా ని వాడి తమని కాపాడటంతో షిన్ డెన్స్ జై ని తమ లీడర్ గా ఎన్నుకుంటారు.

Also Read : OG Comic Book : పవన్ కళ్యాణ్ OG కామిక్ బుక్ వచ్చేసింది.. ఇక్కడ ఆర్డర్ చేసుకోండి..

యుద్ధ సమయంలో సేవలు చేయడానికి వచ్చిన ఓ జపాన్ నర్స్ తో జై ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అనుకోకుండా ఇండియన్ ఆర్మీ మోహన్ సింగ్ జపాన్ కి వచ్చి జైని చూడటంతో సుభాష్ చంద్రబోస్ వస్తున్నాడు, నిన్ను రమ్మన్నారు అని చెప్పి జైని తీసుకెళ్తాడు. జై షిన్ డెన్ ని, కడుపుతో ఉన్న అతని భార్యని మరో షిన్ డెన్ నాయకుడు ఓజాస్ కి అప్పచెప్పి సుభాష్ చంద్రబోస్ తో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద మణిపూర్ బేస్ కోసం యుద్దానికి వెళ్తాడు.

ఆ యుద్దాన్ని బోస్, జై గెలుస్తారు. జై లేని సమయంలో బ్లాక్ డ్రాగన్స్ వచ్చి షిన్ డెన్స్ అందర్నీ చంపేసి ఓజాస్ ని, జై భార్యని ఎత్తుకెళ్తారు. దీంతో జై కోపంతో వెళ్లి బ్లాక్ డ్రాగన్స్ ని కొంతమందిని చంపేస్తాడు. అప్పటికే జై భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. ఆ బిడ్డ గంభీర(పవన్ కళ్యాణ్)ని ఓజాస్ కి ఇచ్చి దూరంగా పెంచి అన్ని విద్యలు నేర్పించు అని చెప్పి జై వెళ్ళిపోతాడు.

Pawan Kalyan

అక్కడ్నుంచి మనకు OG సినిమాలో చూపించిందే. OG సినిమా ఓపెనింగ్ సీన్ లో ఓజాస్ ని బ్లాక్ డ్రాగన్స్ చంపేస్తే గంభీర తప్పించుకొని ఇండియాకు వచ్చిన సంగతి మనం సినిమాలో చూసేసాం. అలా ఓజాస్ గంభీర తండ్రి జై కథని OG కామిక్ బుక్ లో చెప్పేసారు. పవర్ ఫుల్ బొమ్మలతో, యుద్ధ సన్నివేశాల బొమ్మలతో కథని బాగానే చెప్పారు. ఇదే OG సినిమా ప్రీక్వెల్ అని తెలుస్తుంది. దీన్నే సినిమాగా తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

గంభీర తండ్రి పాత్రలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తాడని ఈ బుక్ తో క్లారిటీ వచ్చేసింది. అయితే గంభీరని ఓజాస్ కి అప్పచెప్పి జై ఎక్కడికి వెళ్ళిపోయాడు, తండ్రి కొడుకులు కలుస్తారా అనేది సస్పెన్స్. మరి అది ఓజి ప్రీక్వెల్ సినిమాలో చూపిస్తారా లేదా దానికి ఇంకో పార్ట్ తీస్తారా చూడాలి. ఇక ఆ కటానా చరిత్ర కొంత ఈ కామిక్ బుక్ లో చూపించారు. అదంతా జపాన్ యోధుల చుట్టూ తిరుగుతుంది. పూర్తిగా మాత్రం చెప్పలేదు.(OG Comic Book)

OG Comic Book

మొత్తానికి సినిమాతోనే కాదు ఓజి కామిక్ బుక్ తో కూడా పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చి పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు. బుక్ రిలీజ్ కి ముందు ఈ కథకి సంబంధించి ఓ యానిమేషన్ వీడియో రిలీజ్ చేసి హైప్ ఇచ్చారు. ఇక ఈ బుక్ తోనే ఓజి ప్రీక్వెల్ పై అంచనాలు నెలకొల్పారు. బుక్ మాత్రం చాలా క్వాలిటీగా డిజైన్ చేసారు. ఈ బుక్ కావాలంటే https://cineviz.co.in/store ఈ సైట్ లో ఆర్డర్ చేసుకోండి.