Site icon 10TV Telugu

OG : ప‌వ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. అదిరిపోయిన ఓజీ గ్లింప్స్.. విల‌న్‌తో ఓజీకి బ‌ర్త్‌డే విషెస్‌..

Pawan kalyan OG glimpse out now

Pawan kalyan OG glimpse out now

OG : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీ OG. ఈ చిత్రానికి సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ క‌థానాయిక‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది.

థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25 న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

Pawan Kalyan Birthday : పవన్ బర్త్ డే.. చిరు, బన్నీ నుంచి సీఎం టు పీఎం.. సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు.. ఎవరెవరు చెప్పారంటే..

ఇక నేడు (సెప్టెంబ‌ర్ 2)న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

ఈ గ్లింప్స్ అదిరిపోయింది. సినిమా పై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింతగా పెంచేసింది. విల‌న్ గా న‌టిస్తున్న ఇమ్రాన్ హ‌ష్మితో ఓజీకి ఎలివేష‌న్స్ ఇస్తూ.. ప‌వ‌న్ ను ప‌వ‌ర్ ఫుల్ గా చూపించారు.

Exit mobile version