Pawan Kalyan OG Movie Shooting Getting Another Break
OG Movie : పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఆయన చేతిలో ఉన్న సినిమాలు కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. పవన్ ఫిక్స్ అయి ఈ సంవత్సరం అన్ని సినిమాలు పూర్తి చేయాలని వరుస డేట్స్ ఇస్తున్నారు. హరిహరవీరమల్లు పూర్తిచేసి ఇప్పుడు OG సినిమాకు డేట్స్ ఇచ్చారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా, భారీ హైప్ ఉన్న సినిమా OG.
OG సినిమాకు పవన్ 20 రోజులు డేట్స్ ఇవ్వాలి. ఇన్నాళ్లు పవన్ రాజకీయ బిజీ వల్ల ఆగిపోయిన OG సినిమా ఇటీవలే షూట్ మొదలైంది. రెండు రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ షూట్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ముంబైలో జరుగుతుంది. నిన్న ముంబై షూట్ నుంచి పవన్ కళ్యాణ్ ఫొటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఇన్నాళ్లు పవన్ రాజకీయాల వల్ల ఆగిన సినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది అనుకోని ఫ్యాన్స్ సంతోషించేలోపే ఈ సినిమాకు మళ్ళీ బ్రేక్ పడింది.
Also Read : Pawan Kalyan : ముంబైలో OG షూట్.. పవన్ కళ్యాణ్ ఫొటోలు, వీడియోలు లీక్.. బెల్ బాటమ్ ప్యాంట్ లో..
ఈసారి OG సినిమాకు బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ వల్ల బ్రేక్ పడింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీ సింగిల్ గా ఉన్న పోర్షన్స్ కొన్ని షూట్ పూర్తయ్యాయి. పవన్ తో కాంబినేషన్ ఉన్న సీన్స్ చేయాలి. అయితే ఇమ్రాన్ హష్మీ తాజాగా డెంగ్యూ ఫీవర్ బారిన పడ్డారు. డాక్టర్స్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పారు. దీంతో మూవీ యూనిట్ కి సమాచారం అందించగా పవన్, మూవీ యూనిట్ అర్ధం చేసుకొని ఆరోగ్యంగా తయారయ్యాకే షూటింగ్ పెట్టుకుందామని చెప్పారంట.
దీంతో పవన్ – ఇమ్రాన్ హష్మీ కాంబో లేని సీన్స్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. డెంగ్యూ అంటే కనీసం నెల రోజులు అయినా రెస్ట్ తీసుకోవాలి. ఆ సమయంలో మళ్ళీ పవన్ డేట్స్ ఇస్తారో లేదో చూడాలి. దీంతో మరోసారి OG షూట్ కి బ్రేక్ పడుతుంది. ఇటీవలే OG సినిమాని సెప్టెంబర్ 25 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మళ్ళీ షూట్ కి బ్రేక్ పడుతుంది కాబట్టి చెప్పిన టైంకి వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.