Pawan Kalyan OG Release Date Occupied by NTR Devara Movie Game Changer Release Date new Talk goes Viral in Tollywood
Devara – OG : పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 27 వస్తుందని ఆల్రెడీ డేట్ కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా షూట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించడంతో ఇప్పట్లో షూటింగ్ కి డేట్స్ ఇచ్చేలా లేడు. దీంతో పవన్ OG సినిమా వాయిదా పడుతుందని టాలీవుడ్ లో అందరూ ఫిక్స్ అయిపోయారు. పవన్ OG వాయిదా పడితే ఆ డేట్ కి ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవుతుందని కొత్త టాక్ నడుస్తుంది.
దేవర సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఒకవేళ పవన్ OG రిలీజ్ కాకపోతే దేవర ముందుకు వచ్చి సెప్టెంబర్ 27 నే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషిస్తుంటే పవన్ ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. అసలే OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో పక్క గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడొస్తుందో అని అభిమానులు మూడేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
Also Read : Akira Nandan – Aadya : తండ్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్న అకిరా, ఆద్య.. పవన్ ఫ్యాన్స్‌లో జోష్..
అయితే గేమ్ ఛేంజర్ అక్టోబర్ లేదా నవంబర్ లో ఉండొచ్చని నిర్మాతలు ఇటీవల తెలిపారు. షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది. ఒకవేళ పవన్ OG వాయిదా పడి, దేవర ముందుకెళ్తే గేమ్ ఛేంజర్ సినిమా దసరాకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఏ సినిమా ఎప్పుడొస్తుందో కరెక్ట్ గా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.