Akira Nandan – Aadya : తండ్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్న అకిరా, ఆద్య.. పవన్ ఫ్యాన్స్‌లో జోష్..

మెగా ఫ్యామిలీ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడటానికి విచ్చేస్తున్నారు.

Akira Nandan – Aadya : తండ్రి ప్రమాణ స్వీకారానికి వస్తున్న అకిరా, ఆద్య.. పవన్ ఫ్యాన్స్‌లో జోష్..

Pawan Kalyan Kids Akira Nandan Aadya coming for Pawan Taking Oath Ceremony in Gannavaram

Updated On : June 12, 2024 / 8:34 AM IST

Akira Nandan – Aadya : నేడు ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి పీఎం మోదీతో సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా భారీగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా పిలవడమే కాక, పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మెగా ఫ్యామిలీ అంతా తరలి వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీతో కలిసి గన్నవరం చేరుకున్నారు. మెగా ఫ్యామిలీ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడటానికి విచ్చేస్తున్నారు.

Also Read : Mahesh -Sudheer : మహేష్ బాబుకి కాల్ చేసిన సుధీర్ బాబు.. వైరల్ అవుతున్న ఆడియో.. ఏం మట్లాడుకున్నారు అంటే..

ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్, ఆద్య కూడా తండ్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చూడటానికి వస్తున్నారు. ఇప్పటికే ఆద్య గన్నవరం ఎయిర్ పోర్ట్ లో మెగా ఫ్యామిలీతో కనిపించింది. అకిరా ఎన్నికల్లో పవన్ గెలిచిన దగ్గర్నుంచి పవన్ వెంటే ఉంటున్నాడు. దీంతో పవన్ అభిమానుల కళ్ళు ఈ ఇద్దరిపైనే ఉన్నాయి. ఇవాళ తండ్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అకిరా, ఆద్య ఎంత ఆనందంగా స్పందిస్తారో అని వారి ఫోటోలు, వీడియోల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.