Pawan Kalyan : వారాహి షెడ్యూల్ రిలీజ్ చేసిన పవన్.. మరి మూవీ షెడ్యూల్స్ సంగతి ఏంటి?

పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి షెడ్యూల్ ని రిలీజ్ చేశాడు. మరి సెట్స్ పై ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు షెడ్యూల్స్ సంగతి ఏంటి?

Pawan Kalyan Movies : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), OG, Bro, హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘బ్రో’ మూవీ షూటింగ్ పూర్తి చేసేయగా.. మిగతా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీరమల్లు షూటింగ్ ని పవన్ మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. అయితే పవన్ రాజకీయ పనులు వల్ల ఆ మూవీ షూటింగ్ పెండింగ్ లేటు అవుతూ వచ్చింది. ఇక ఈ మూవీ షూటింగ్ దాదాపు 50% బ్యాలన్స్ ఉండగానే.. ఉస్తాద్ అండ్ OG ని స్టార్ట్ చేసి వాటి చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చాడు.

Pawan kalyan Varahi Yatra : జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. అన్నవరంలో యాత్రకు శ్రీకారం ..

ఇక ఆ మూవీ షూటింగ్ స్పీడ్ చూసిన పవన్ అభిమానులు.. మొత్తం మూవీ షూటింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు తన రాజకీయ ప్రచారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ నేపథ్యంలోనే వారాహి షెడ్యూల్ ని రిలీజ్ చేశాడు. దీంతో ప్రస్తుతం చేయాల్సిన సినిమా షెడ్యూల్స్ సంగతి ఏంటని అభిమానులు కన్‌ఫ్యూషన్ లో పడ్డారు. మొన్నటి వరకు పవన్ డిసెంబర్ వరకు షూటింగ్స్ లో పాల్గొని సినిమా చిత్రీకరణలు అన్ని పూర్తి చేస్తాడని టాక్ వినిపించింది.

Ram Charan : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై రామ్ చరణ్ ట్వీట్.. బంగారు తెలంగాణ కల!

ఇప్పుడు రాజకీయ ప్రచారానికి శంఖం పూరించడంతో సినిమా సంగతులు ఏంటని అభిమానులు అరా తీస్తున్నారు. వీరమల్లు షూటింగ్ జూన్ లోనే మొదలు అవుతుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా 50 శాతం పెండింగ్ ఉంది. ఇక ఉస్తాద్ మూవీ విషయానికి వస్తే.. ఒక షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేసుకుంది. OG మూవీ మొదటి షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేసేసిన పవన్.. ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ పాల్గొంటున్నాడు. అయితే పవన్ ప్రచారం చేస్తూనే ఈ సినిమా చిత్రీకరణలు కూడా పూర్తి చేస్తాడా? లేదా షూటింగ్స్ కి కంప్లీట్ గా బ్రేక్ ఇవ్వబోతున్నాడా? అనేది మూవీ టీమ్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు