Pawan Kalyan : చరణ్ విజయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్రెస్ నోట్..

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి ఏ రంగంలో ఎవరు ఎలాంటి విజయాలు సాధించినా అధికారికంగా తన జనసేన నుంచి అభినందిస్తూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక చరణ్, పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.................

Pawan Kalyan released a press note praising Ram Charan

Pawan Kalyan :  RRR సినిమా తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమా ఏకంగా అయిదు అవార్డులతో కొల్లగొట్టింది. ఈ అవార్డుని రాజమౌళి, కీరవాణి అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరవడంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

రామ్ చరణ్ కూడా రాజమౌళితో పాటు వేదికపైకి వెళ్లి మాట్లాడాడు. అంతే కాకుండా HCA అవార్డు వేడుకల నిర్వాహకులు రామ్ చరణ్ చేత కూడా ఓ అవార్డుని ఇప్పించారు. అలాగే స్పాట్ లైట్ అవార్డుని రామ్ చరణ్ అందుకున్నాడు. దీంతో చరణ్ అభిమానులు, RRR యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల రామ్ చరణ్ సాధిస్తున్న విజయాలపై తాజాగా స్పెషల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి ఏ రంగంలో ఎవరు ఎలాంటి విజయాలు సాధించినా అధికారికంగా తన జనసేన నుంచి అభినందిస్తూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక చరణ్, పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Naatu Naatu song Performance : చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ వేదికపై నాటు నాటు పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారా?

ఈ ప్రెస్ నోట్ లో.. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డుని స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కి, దర్శకులు శ్రీ రాజమౌళికి, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. దీంతో పవన్ చరణ్ ని ఇలా అభినందిస్తూ రాయడంతో ఈ ప్రెస్ నోట్ వైరల్ గా మారింది.