Pawan Kalyan Sai Dharam Tej remake movie titled as BRO
PKSDT : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం వినోదయ సిత్తం రీమేక్. తమిళంలో సోషియో ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ కథలో కొన్ని చేంజ్స్ చేసి తమిళంలో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే ఈ రీమేక్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర సంబంధించిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసేశాడు దర్శకుడు. ఇప్పుడు సాయి ధరమ్ పై ఉన్న సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.
Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!
ఈ సినిమా గురించి ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్న చిత్ర యూనిట్.. ఇప్పడి వరకు టైటిల్ ని మాత్రం ఫైనల్ చేయలేదు. అయితే ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక టైటిల్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకి BRO అనే టైటిల్ ని ఖరారు చేశారట. ఈ టైటిల్ ని ఈ వారంలో అనౌన్స్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ టైటిల్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చింది. మరి చిత్ర యూనిట్ ఇదే టైటిల్ ని అనౌన్స్ చేస్తారా? లేదా ఇది కేవలం రూమర్ మాత్రమేనా? తెలియాల్సి ఉంది.
NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!
ప్రస్తుతం సాయి ధరమ్ విరూపాక్ష ప్రమోషన్స్ లో ఉండడంతో ఈ మూవీ షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు. జులై 28న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ ఆల్రెడీ మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా వారియర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.