Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!

Pawan Kalyan look in OG movie with godavari janasainiks
Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహూ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేశారు. ఆ షెడ్యూల్ లో పవన్ పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తుంది.
NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!
ఇక గత వారం జరిగిన షెడ్యూల్ లో ప్రియాంక అండ్ పవన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. పుణేలో అందమైన లొకేషన్స్ లో ఆ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్రలో జరుపుకుంటుంది. అక్కడ వై లేక్ (Wai lake) వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. ఇక ఆ లేక్ వద్ద పవన్ గోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన జనసైనికులను కలిశాడు. వారితో కలిసి దిగిన ఫోటోను తానే స్వయంగా ట్విట్టర్ పోస్ట్ చేస్తూ ఆ విషయాన్ని తెలియజేశాడు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ పవర్ ఫుల్ గ్లింప్స్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే రోజే!
“మహారాష్ట్రలోని వై లేక్ వద్ద OG షూటింగ్ జరుపుకుంటుండడగా ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు జనసైనికులు అయిన సింగిరి రాజేష్, సన్నీ జాన్ ని కలిశాను” అంటూ ఒక ఫోటో షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోలోని పవన్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కరాటే డ్రెస్ లో పవన్ కనిపిస్తున్నాడు. గతంలో ఖుషి సినిమాలో పవన్ ఆ లుక్ లో కనిపించాడు. దీంతో ఆ ఫోటోని, ఇప్పటి ఫొటోతో జత చేసి షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan look in OG movie with godavari janasainiks

Pawan Kalyan look in OG movie with godavari janasainiks
While shooting for ‘OG‘ at Wai lake in Maharashtra , met our Janasainiks; Singiri Sai, Singiri Rajesh and Sanni John from Kovvur , Rajamundry, East Godavari. pic.twitter.com/oPnrOaaFbf
— Pawan Kalyan (@PawanKalyan) May 8, 2023