Pawan Kalyan : అయోధ్య రామ మందిరంతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. రామకార్యం అంటే ప్రజా కార్యం..
అయోధ్య రామ మందిరంతో పవన్ కళ్యాణ్ తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు.
- gum 95921
- Updated on- January 22, 2024 / 03:32 PM IST
Pawan Kalyan selfie with Ayodhya Ram Mandir photo gone viral
Pawan Kalyan : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంది. నేడు ఆ కల నెరవేరింది. ప్రధాని మోదీ చేతులు మీదుగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. ఇక ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రత్యేక్షంగా చూసేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు వెళ్లారు. ఇక ఈరోజు ఉదయం రామ మందిరం వద్దకి బయలుదేరిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులకు తెలియజేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా ఒక సెల్ఫీని షేర్ చేశారు. రామ మందిరంతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగిన ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోని పవన్ షేర్ చేస్తూ.. “రామకార్యం అంటే రాజ్య కార్యం, ప్రజా కార్యం. జై శ్రీ రామ్” అంటూ రాసుకొచ్చారు.
Also read : Ram Charan : అయోధ్యలో రామ్ చరణ్ క్రేజ్.. ఇది కదా కావాల్సింది.. చరణ్ తండ్రి ఆయన..
ఇక ఈ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం గురించి టాలీవుడ్ హీరోలు కూడా ట్వీట్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. “చరిత్ర యొక్క ప్రతిధ్వనులు మరియు నమ్మకం యొక్క పవిత్రత మధ్య అయోధ్యలో రామమందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత మరియు ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది” అంటూ మహేష్ పేర్కొన్నారు.
