Pawan Kalyan : నన్ను పని చేసుకోనివ్వండి.. నేను మీసం తిప్పితే, మీరు OG అని అరిస్తే పనులు జరగవు..

పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయి కామెంట్స్ చేసారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న మన్యం పార్వతీపురం జిల్లాలోని పర్యటన భాగంగా బాగుజోల గిరిజన గ్రామంలోని రోడ్లను, అక్కడి పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడున్న కొంతమంది యువత OG అంటూ సినిమా గురించి అరిచారు. దీంతో పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయి కామెంట్స్ చేసారు.

Also Read : CM Revanth Reddy : ఇకపై నేను సీఎంగా ఉన్నంతవరకు టికెట్ రేట్లు పెంచను, బెనిఫిట్ షోలు ఉండవు.. షాక్ లో టాలీవుడ్..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నన్ను పనిచేసుకోనివ్వండి. నా చుట్టు ముట్టేస్తే నేను పనిచేసుకోలేను. రోడ్లు ఎలా ఉంటాయో చూద్దామంటే మీరంతా చుట్టుముట్టేసి రోడ్లు కనపడట్లేదు. యువతకు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పుడు సినిమాల మోజులో పడి, పోస్టర్లు పెట్టి, OG OG అని, లేదా వేరే హీరోలకు జేజేలు కొడుతున్నారు. ఇవన్నీ చేయొచ్చు కానీ మీరు మీ జీవితంపై ఫోకస్ చేయకపోతే ముందుకు వెళ్ళలేరు. మాట్లాడితే అన్న మీసం తిప్పు, మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, నేను ఛాతి కొట్టుకుంటే రోడ్లు పడవు, నేను వెళ్లి సీఎం, పీఎంలను అడిగితే రోడ్లు పడతాయి. అందుకే నేను మీసాలు తిప్పడాలు, ఛాతులు కొట్టుకోడాలు చేయను. నన్ను పని చేసుకోనివ్వండి అని అన్నారు. దీంతో పవన్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

జేజేలు కావాలనుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో అసలు సినిమాల గురించి మాట్లాడొద్దు, నా పని నన్ను చేసుకోనివ్వండి అని ఫ్యాన్స్ కే చెప్పడం గ్రేట్ అని పవన్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.