Pawan Kalyan shares about his friendship with Trivikram in Unstoppable show
Pawan Kalyan- Trivikram : బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.
పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్నేహితులు అని మన అందరికి తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని అందరికి తెలుసు. అసలు అన్‌స్టాపబుల్ షోకి పవన్ త్రివిక్రమ్ తో వస్తారనుకున్నారు అంతా. కానీ రాలేదు. దీంతో బాలకృష్ణ త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్, నువ్వు ఫ్రెండ్స్ అంటగా అని బాలయ్య అడగగా.. పవన్.. ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు.
Pawan Kalyan Farm House : ఫామ్ హౌస్ సీక్రెట్స్ బయట పెట్టిన పవన్..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాకు, ఆయనకీ ఇప్పటికి ఓ గొడవ నడుస్తుంది. అతను అతడు సినిమా కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేను నిద్రపోయాను అని అంటాడు. నేనేమో కాదు అంటాను. ఈ గొడవ ఇప్పటికి మా మధ్య కొనసాగుతూనే ఉంది. మా ఇద్దరి సినిమా తప్ప అన్ని విషయాలు చర్చకు వస్తాయి. పుస్తకాలు, పురాణాలు, సైన్స్.. ఇలా అన్ని మాట్లాడుకుంటాం. ఆయన దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన నాకు ఫ్రెండ్ కంటే కూడా గురువు లాంటివాడు. గురూభాయ్ అని పిలుస్తాను త్రివిక్రమ్ ని అని తెలిపారు.