Pawan Kalyan Shopping for her Daughter Aadya Photos goes Viral
Pawan Kalyan – Aadya : పవన్ కూతురు, కొడుకు ఆద్య, అకిరాలు రేణు దేశాయ్ వద్ద ఉంటున్నా అప్పుడప్పుడు నాన్న దగ్గరకు కూడా వస్తుంటారని తెలిసిందే. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెగ్యులర్ గా ఆద్య, అకిరా పవన్ తో కనిపిస్తున్నారు. ఇటీవల స్వతంత్ర దినోత్సవం రోజున ఆద్య పవన్ తో కలిసి కనిపించింది. తాజాగా మరోసారి ఆద్య పవన్ తో కలిసి కనిపించింది.
పవన్ కళ్యాణ్ నిన్న లేపాక్షి కళాకృతులను పరిశీలించడానికి వెళ్లగా పవన్ తో పాటు కూతురు ఆద్య కూడా వెళ్ళింది. అక్కడ ఆద్య షాపింగ్ చేసి కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు తీసుకోవడంతో పవన్ వాటికి డబ్బులు ఇచ్చి కూతురికి కొనిచ్చారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. పవన్ కూతురు, కొడుకు ఫొటోలు బయటకు వస్తే, అందులోను పవన్ తో కలిసి వస్తే ఫ్యాన్స్ మరింత సంతోషం వ్యక్తం చేసారు.
Also Read : Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి మరింత గుర్తింపు.. సొంత డబ్బులు ఖర్చు చేస్తానని వెల్లడి
ఇక పవన్ లేపాక్షి కళాకృతులను పరిశీలించిన అనంతరం.. మన రాష్ట్రానికి వచ్చే అతిథులకు, ప్రతినిధులకు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవారికి రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు గిఫ్ట్ హ్యాంపర్స్ రూపంలో ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. అయితే వీటికి పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన బడ్జెట్ నుంచి కేవలం 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60శాతం తన సొంత డబ్బుని జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.