Pawan Kalyan – Nagababu : పిఠాపురంలో అన్ని తానై పనిచేశారు.. నాగబాబుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెష్..

తాజాగా నేడు నాగబాబు పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్ అధికారికంగా తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ విడుదల చేసారు.

Pawan Kalyan Special Birthday Wishes to Mega Brother Nagababu

Pawan Kalyan – Nagababu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రభుత్వంలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఇద్దరు అన్నయ్యలతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక నాగబాబు అయితే పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉంటారు. జనసేన పార్టీలో కీలక పాత్ర పోషించారు. పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి నాగబాబు అయన వెంటే ఉండి సపోర్ట్ చేసారు. ఇటీవల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తరపున శ్రమించారు.

తాజాగా నేడు నాగబాబు పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్ అధికారికంగా తన అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ విడుదల చేసారు.

Also Read : SSMB 29 Update : కెన్యాలోనే మహేష్ -రాజమౌళి సినిమా షూటింగ్..? మహేష్ సినిమాపై రాజమౌళి ఫస్ట్ పోస్ట్..

ఇందులో పవన్ కళ్యాణ్.. సామాజిక అంశాలను సునిశితంగా విశ్లేషించి, ప్రజా పక్షం వహిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తారు మా చిన్నన్నయ్య నాగబాబు గారు. చిన్నన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, నెల్లూరులో నాగబాబు గారు లా చదువుకొనే రోజుల్లో నానీ పాల్కీవాలా రచనల గురించి నాకు చెప్పేవారు. అదే విధంగా సాహిత్యంతోపాటు సామాజిక రాజకీయ అంశాలను తెలిపే పుస్తకాల గురించి పరిచయం చేసింది నాగబాబు గారే. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ తానై పని చేశారు. చిన్నన్నయ్య శ్రీ నాగబాబు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనందాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు. పలువురు జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.