SSMB 29 Update : కెన్యాలోనే మహేష్ -రాజమౌళి సినిమా షూటింగ్..? మహేష్ సినిమాపై రాజమౌళి ఫస్ట్ పోస్ట్..
తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

Rajamouli First Post on Mahesh Babu SSMB 29 Movie
SSMB 29 Update : మహేష్ బాబు రాజమౌళి త్వరలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు రాజమౌళి నెక్స్ట్ సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫుల్ గా జుట్టు, గడ్డం పెంచేసి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాడు మహేష్.
ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో రాజమౌళి లొకేషన్స్ వేటలో పడ్డాడు. ఈ సినిమా అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని, అడవుల నేపథ్యంలో ఉంటుందని, ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో రాజమౌళి కూడా చెప్పాడు. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కెన్యాలోని ఓ అడవి ప్రాంతంలో జంతువుల మధ్య తిరుగుతున్న ఫోటోని షేర్ చేసి.. వెతుకుతున్నాను అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
రాజమౌళి ఆల్రెడీ అడవి నేపథ్యంలో సినిమా అని చెప్పడంతో కెన్యాలో అడవులు, జంతువులు, అక్కడి నేషనల్ యానిమల్స్ పార్క్ పరిశీలించి షూటింగ్ కి అనువైన ప్రదేశాలు వెతికే పనిలో రాజమౌళి ఉన్నాడు అని తెలుస్తుంది. దీంతో రాజమౌళి ఒక్క పోస్ట్ తో సినిమా వర్క్ ఫాస్ట్ గానే జరుగతుందని చెప్పేసాడు. లొకేషన్స్ ఫైనల్ అయితే షూటింగ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే సంవత్సరం మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూట్ జరగనుందని తెలుస్తుంది.