Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈసారి రికార్డ్ కొట్టాల్సిందే.. నో ఛాన్స్.. కెరీర్ హైయెస్ట్ రాబడతాడా?

పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.(Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదని అందరికి తెలిసిందే. ఆయన ఫోకస్ చేస్తే బాక్సాఫీస్ లు దద్దరిల్లిపోతాయని కూడా అందరికి తెలుసు. అసలు ఆయనకు ఇప్పుడు కొంతమంది హీరోలకు ఉన్నట్టు పాన్ ఇండియా మోజు కూడా లేదు. అందుకే అందరూ కలెక్షన్స్ వందల కోట్లు, వెయ్యి కోట్లు వేసుకుంటుంటే ఆయన మాత్రం రీజనల్ కలెక్షన్స్ లోనే ఉన్నారు.(Pawan Kalyan)

కానీ ఒకప్పుడు ఈ వెయ్యి కోట్ల హంగామా లేనప్పుడు పవన్ లీక్ అయిన సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. వంద కోట్లు సాధించాడు. ఇప్పటిలాగా కోట్ల కలెక్షన్స్ పక్కన పెడితే పవన్ కి కూడా చాలా రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు జనాలు అంతా కేవలం మూడు రోజులు వీకెండ్ వచ్చే కలెక్షన్స్ మీదే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఆ రికార్డులు సెట్ చేసే ఛాన్స్ వచ్చింది.

Also Read : Sreeleela Mother : ఎన్టీఆర్ చిన్నప్పుడు.. శ్రీలీల తల్లి అమెరికాలో కలిసి..

పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ఒక సాంగ్ తోనే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా OG సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అంతా షాక్ అవుతున్నారు. హరిహర వీరమల్లు ఫ్లాప్ అయినా OG క్రేజ్ కి భారీగా థియేటరికల్ బిజినెస్ జరిగింది.

టాలీవుడ్ సమాచారం ప్రకారం నైజాం 60 కోట్ల రూపాయలకు, ఆంద్ర 70 కోట్లకు, సీడెడ్ 25 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ 40 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అంటే ఆల్మోస్ట్ 200 కోట్లకు థియేటరికల్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన కనీసం 400 కోట్ల గ్రాస్ OG సినిమా వసూలు చేయాలి. మరి పవన్ కళ్యాణ్ రీజనల్ సినిమాతో కెరీర్ హైయెస్ట్ 400 కోట్ల గ్రాస్ వసూలు చేస్తాడా? ఒకప్పుడు రికార్డులు సెట్ చేసిన పవర్ స్టార్ మరోసారి తన స్టామినా చూపిస్తాడా చూడాలి. మొత్తానికి OG సినిమాకు భారీ టార్గెట్ ఉంది. ఈసారి మాత్రం పవన్ కి నో ఛాన్స్ హిట్ కొట్టి కలెక్షన్స్ తెప్పించాల్సిందే. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు.

Also Read : Pandu Master : వామ్మో.. ఇన్‌స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఇలా చేస్తున్నారా.. ఢీ పండు చెప్పింది వింటే.. మీరు జాగ్రత్త..