×
Ad

Pawan Kalyan : పవన్ OG అప్డేట్ కూడా రాబోతోందా? బాలీవుడ్ హీరో హింట్.. ఆ డేట్ కి..?

పవన్ OG సినిమా అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం.

  • Published On : March 17, 2024 / 10:26 AM IST

Pawan Kalyan They Call Him OG Movie Update coming Soon Emraan Hashmi Tweet goes Viral

Pawan Kalyan : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉండటంతో పవన్ అక్కడే బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సినిమాలకు డేట్స్ ఇచ్చే పరిస్థితే లేదు. దీంతో పవన్ చేతిలో ఉన్న నాలుగు సినిమాలు ప్రస్తుతానికి ఆగాయి. వీటిల్లో OG సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ చేస్తారని ప్రకటించారు. పవన్ ఒక్క షెడ్యూల్ డేట్స్ ఇస్తే OG మొత్తం షూటింగ్ అయిపోతుందని సమాచారం. ఆల్రెడీ OG గ్లింప్స్ రిలీజ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

నిన్న మైత్రి మూవీ మేకర్స్ పక్కన పెట్టేసిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా అప్డేట్ త్వరలో ఇస్తామని చెప్పడంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోతూనే ఆనందించారు. ఇప్పుడు OG సినిమా అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో బాలీవుడ్, తమిళ్ స్టార్స్ కూడా చాలా మంది నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం.

Also Read : Gangs of Godavari : విశ్వక్ సేన్ సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎన్నికలు అయ్యాకే రిలీజ్..

ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా ఓ నెటిజన్ OG సినిమా గురించి చెప్పండి, అందులో మీ పాత్ర గురించి చెప్పండి అనడంతో ఇమ్రాన్.. నేనేమి రివీల్ చేయను ఇప్పుడు, కానీ గ్లింప్స్ మాత్రం రాబోతుంది త్వరలో అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇమ్రాన్ హష్మీ చెప్పేది OG సినిమా గురించే అని, త్వరలో మార్చ్ 24న ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజున OG సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా లేక కేవలం ఇమ్రాన్ హష్మీ కనిపిస్తాడా చూడాలి. దీంతో ఒకేసారి ఉస్తాద్, OG అప్డేట్స్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.