Gangs of Godavari : విశ్వక్ సేన్ సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎన్నికలు అయ్యాకే రిలీజ్..
అయితే గామి మార్చ్ లో రిలీజ్ అవ్వగా ఏప్రిల్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుందని గామి ప్రమోషన్స్ లో తెలిపాడు విశ్వక్. అయితే మళ్ళీ ఇంకో నెల రోజులు వాయిదా పడింది ఈ సినిమా.

Vishwak Sen Gangs of Godavari Movie New Releasing Date Announced
Gangs of Godavari : విశ్వక్ సేన్ (Vishwaksen) ఇటీవలే గామి సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. అయితే విశ్వక్ సేన్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. కృష్ణచైతన్య దర్శకత్వంలో నేహశెట్టి (Neha Shetty) హీరోయిన్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో అంజలి (Anjali) ముఖ్య పాత్రలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెరకెక్కింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ బాగా వైరల్ అయింది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గత సంవత్సరం లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. గామి సినిమా లైన్ లోకి రావడంతో మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా పడింది. అయితే గామి మార్చ్ లో రిలీజ్ అవ్వగా ఏప్రిల్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుందని గామి ప్రమోషన్స్ లో తెలిపాడు విశ్వక్.
అయితే మళ్ళీ ఇంకో నెల రోజులు వాయిదా పడింది ఈ సినిమా. తాజాగా నేడు దేశవ్యాప్తంగా ఎన్నికల డేట్స్ ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని ఇంకో నెల రోజులు వాయిదా వేసి తాజాగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యాక మే 17న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇక ఈ సినిమా పీరియాడిక్ గా గోదావరి జిల్లాల్లో రాజకీయ కథాంశంతో తెరకెక్కబోతుంది సమాచారం.
Get ready to witness the Most rugged and violent tale from the banks of Godavari! ??
Mass ka Das @VishwakSenActor's #GangsofGodavari to release on ??? ???? ????, worldwide.
Meet you in theatres this Summer #GOGOnMay17th ? pic.twitter.com/lOmdMLdOxy
— Sithara Entertainments (@SitharaEnts) March 16, 2024