They Call Him OG : పవన్ కళ్యాణ్ OG ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..? కొత్త పోస్టర్ రిలీజ్..

తాజాగా OG సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.

They Call Him OG

They Call Him OG : పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. త్వరలో సెప్టెంబర్ 25న OG సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే OG సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా OG సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి మొదటి సాంగ్ ‘ఫైర్ స్టార్మ్’ ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కళ్ళను పవర్ ఫుల్ గా చూపిస్తూ ఓ పాముని కూడా చూపించారు.

Also Read : Vijay Deverakonda : నేనే ఇంకా సినిమా చూడలేదు.. నేను థియేటర్ కి వెళ్లాలంటే భయపెడుతున్నారు..

కోపంలో పుట్టి.. పోరాటం కోసం ఎదిగాడు. అతను మళ్ళీ చివరి పేజీ రాయడానికి తిరిగొస్తున్నాడు అంటూ ఎలివేషన్ ఇస్తూ ఈ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో శింబు పాడింది ఈ పాటే అని తెలుస్తుంది.

Also See : Nara Rohith – Siree Lella : రెండేళ్ల ప్రేమ.. లవ్ యానివర్సరీ.. గర్ల్ ఫ్రెండ్ తో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన నారా రోహిత్..