Pawan Kalyan: మళ్లీ గబ్బర్‌సింగ్ అవతారమెత్తుతున్న పవన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్....

Pawan Kalyan To Play Police Officer Once Again

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటన మరో లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక పవన్ గతంలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించారు. గబ్బర్‌సింగ్ చిత్రంతో పోలీస్ ఆఫీసర్ రోల్స్‌లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక ఆ సినిమా పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

Pawan Kalyan : కొణిదెల బ్యానర్‌లో చరణ్ నిర్మాతగా పవన్ సినిమా.. ఎప్పటికయ్యేనో??

ఆ తరువాత కూడా సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా హిట్ మూవీగా నిలిచింది. ఇక పవన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తుండగా, వైవిధ్యమైన పాత్రల్లో ఆయన మనకు కనిపంచబోతున్నాడు. అయితే పవన్ మరో రీమేక్ సినిమాకు సై అన్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘తేరీ’ చిత్రాన్ని తెలుగులో రీమేక చేసేందుకు పవన్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తేరీ చిత్రాన్ని పోలీసోడు అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేసినా, కూడా కథలో దమ్ము ఉండటంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని పవన్ భావిస్తున్నాడట.

Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం యాక్షన్ మోడ్‌లోకి పవన్

ఇక ఈ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో మరోసారి తనకు బాగా కలిసొచ్చిన గబ్బర్‌సింగ్ అవతారంలో పవన్ కనిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి నిజంగానే పవన్ తేరీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తాడా లేక ఇవన్నీ కేవలం పుకార్లుగానే మిగిలిపోతాయా అనేది చూడాలి.