Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. UBS నుంచి క్రేజీ అప్డేట్.. 40 సెకన్ల పవర్ ప్యాక్డ్ టీజర్ రెడీ
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్న మేకర్స్.
- V Santhosh Kumar
- Published On : February 28, 2026 / 07:13 AM IST
pawan kalyan ustaad bhagat singh latest teaser update
- ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్
- 40 సెకన్ల పాటు ఉందనున్న టీజర్
- త్వరలోనే అధికారిక ప్రకటన
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Vijay: విజయ్ కి మతిస్థిమితం సరిగా లేదు.. విడాకుల పిటీషన్ లో విజయ్ భార్య
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. ఆలాగే, సినిమాపై అంచనాలను ఒక రేంజ్ లో పెంచేశాయి. ఈనేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అంచనాలను మరింత పెంచేలా మరో క్రేజీ అప్డేట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారట మేకర్స్. అదే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్. సినిమా, మార్చి 26న విడుదలవుతున్న వేళ ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉండనుందట.
40 సెకన్ల పాటు ఉందనున్న ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్, ఆయన స్టైల్, డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉండనున్నాయట. మేకర్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ రిలీజ్ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా మారతాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ టీజర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన రానుంది. ఇక, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా అదే లెవల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య మార్చి 26న వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
