Pawan Kalyan Ustaad Bhagat Singh project changes from harish shankar to atlee
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ చిత్రం కేవలం ఒక షెడ్యూల్ ని మాత్రమే జరుపుకొని పక్కన పడింది. హరీష్ శంకర్ కూడా ఈ సినిమాని పక్కన పెట్టేసి.. రవితేజతో సినిమా మొదలు పెట్టారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే, తమిళ దర్శకుడు అట్లీతో పవన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళ చిత్రం తేరికి రీమేక్ అని అందరికి తెలిసిందే. ఈ సినిమాకి అట్లీనే దర్శకత్వం వచించారు. ప్రస్తుతం ఈ మూవీనే హిందీలో వరుణ్ ధావన్ తో రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సినిమాని కూడా అట్లీనే డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also read : Shriya Saran : శ్రియా శరన్ సిస్టర్‌కి ఉందా.. ఆమె పోలికలతో ఉన్న వీడియో వైరల్..
త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు అందించబోతున్నారని తెలుస్తుంది. మరి పవన్ నిజంగానే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారా..? నిజంగా చేస్తుంటే అది ఉస్తాద్ మూవీనా..? మరో మూవీనా..? అనే సందేహాలు ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. వీటి మీద ఓ క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ లో శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు, OG సినిమాల్లో కూడా నటిస్తున్నారు. వీరమల్లు షూటింగ్ 50 శాతం పూర్తీ అయితే, OG షూటింగ్ ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తయింది. మరి ఈ చిత్రాలు షూటింగ్స్ మళ్ళీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో చూడాలి.