Shriya Saran : శ్రియా శరన్ సిస్టర్‌కి ఉందా.. ఆమె పోలికలతో ఉన్న వీడియో వైరల్..
కుటుంబంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రియా శరన్. ఆమెతో పాటు ఆమె చెల్లెలు..

Shriya Saran sister video at Tirumala Tirupati Venkatesa temple video gone viral
Shriya Saran : టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరన్.. దాదాపు తెలుగులోని స్టార్ హీరోలందరి సరసన నటించేశారు. నార్త్ టు సౌత్ పలు భాషల్లో నటించిన శ్రియా.. 24 ఏళ్ళగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే, శ్రియా తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
శ్రియాతో పాటు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకి వస్తున్న శ్రియాతో ఫొటోలు దిగేందుకు అక్కడి భక్తులు ఉత్సాహపడ్డారు. ఇక కొంతమంది ఏమో శ్రియా పక్కనే ఆమె పోలికలతో ఉన్న ఓ అమ్మాయి ని చూసి మెస్మరైజ్ అయ్యారు. ఆ అమ్మాయి కూడా చూడడానికి శ్రియా లాగానే ఉంది. పేస్ కట్ అండ్ స్మైల్ ఇద్దరిది సేమ్ ఒకేలా ఉంది. ఇక ఆమెను చూసిన ఆడియన్స్‌లో.. ఆమె శ్రియా చెల్లిలా అనే డౌట్స్ మొదలయ్యాయి. ఆమె కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా అనే ప్రశ్నలు వేస్తున్నారు.
Also read : Rukmini Vasanth : తెలుగులోకి మరో కన్నడ భామ.. ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. స్టార్ హీరో సరసన..
అయితే శ్రియాకి ఒక బ్రదర్ మాత్రమే ఉన్నారని తెలుసు కానీ సిస్టర్ గురించి ఇప్పుడే బయటకి రావడం. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శ్రియా కూడా.. ఇప్పటివరకు ఎప్పుడు ఈ సిస్టర్ తో ఉన్న ఫోటోలను షేర్ చేయలేదు. మరి ఆమె శ్రియా సొంత సిస్టర్..? లేదా సిబ్లింగ్స్..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో అండ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.