Rukmini Vasanth : తెలుగులోకి మరో కన్నడ భామ.. ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. స్టార్ హీరో సరసన..

కన్నడలో బీర్బల్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన రుక్మిణి వసంత్ ఆ తర్వాత 'సప్త సాగరాలు దాటి' సినిమాతో బాగా వైరల్ అయింది.

Rukmini Vasanth : తెలుగులోకి మరో కన్నడ భామ.. ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్.. స్టార్ హీరో సరసన..

Kannada Actress Sapta Sagaralu Dhaati Fame Rukmini Vasanth Entry in Tollywood Rumours goes Viral

Updated On : January 21, 2024 / 1:43 PM IST

Rukmini Vasanth : మన తెలుగు పరిశ్రమలో కన్నడ భామలు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ మొదలు నుంచి కొన్నాళ్ల క్రితం వచ్చిన అనుష్క, ఆ తర్వాత పూజ హెగ్డే, ఇటీవల కృతిశెట్టి.. ఇలా చాలా మంది కన్నడ హీరోయిన్స్ తెలుగు సినీ పరిశ్రమని ఏలారు. ఇప్పుడు ఇదే బాటలో మరో కన్నడ భామ టాలీవుడ్ లోకి రానుంది. ఆల్రెడీ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన రుక్మిణి వసంత్ త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమాతో రానుందని సమాచారం.

కన్నడలో బీర్బల్ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన రుక్మిణి వసంత్ ఆ తర్వాత ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో లవ్ మ్యారేజ్ చేసుకున్న మిడిల్ క్లాస్ అమ్మాయిలా, భర్త జైలుకి వెళ్తే బాధపడే భార్యలా కనిపించి ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజవ్వడంతో ఇక్కడ కూడా మంచి విజయం సాధించగా రుక్మిణి తెలుగులో ఫ్యాన్స్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత సప్తసాగరాలు దాటి పార్ట్ 2 తో కూడా మెప్పించింది.

Also Read : Sitara Ghattamaneni : అనాధ పిల్లలతో కలిసి గుంటూరు కారం సినిమా చూసిన సితార.. పొగిడేస్తున్న అభిమానులు..

ముఖ్యంగా మిడిల్ క్లాస్ భార్యలా, ఫ్యామిలీని బాగా చూసుకునే అమ్మాయిలా నటించి అబ్బాయిలకు బాగా కనెక్ట్ అయిపోయింది రుక్మిణి. కన్నడలో వరుస సినిమా ఆఫర్లు వస్తుండగా టాలీవుడ్ నుంచి కూడా ఓ సినిమా ఆఫర్ వచ్చినట్టు సమాచారం. జాతిరత్నాలు సినిమాతో అందర్నీ నవ్వించిన KV అనుదీప్ త్వరలో మన మాస్ మహారాజ రవితేజతో సినిమా తీయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మాస్ మహారాజ రవితేజతో రుక్మిణి ఎంట్రీ ఇస్తే ఇక్కడ కూడా వరుస అవకాశాలు సంపాదిస్తుంది. రుక్మిణి తెలుగులో కూడా సినిమాలు చేయాలని ఇక్కడి అభిమానులు కోరుకుంటున్నారు. సప్త సాగరాలు దాటి సినిమాలో చాలా పద్దతిగా కనిపించినా మోడరన్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంది రుక్మిణి.