×
Ad

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. షూటింగ్ కంటిన్యూ..

పవన్ కళ్యాణ్ ఇటీవల మళ్ళీ పాలిటిక్స్ వైపు వెళ్లడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ కి బ్రేక్ పడినట్లు అయ్యింది. అయితే హరీష్ శంకర్..

  • Published On : September 13, 2023 / 09:45 PM IST

Pawan Kalyan Ustaad Bhagat Singh shooting continues no breaks

Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత ఇటీవలే రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టింది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో ఒక ప్రత్యేక సెట్ ని కూడా వేశారు. మూవీలోని పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్లు మేకర్స్ తెలియజేసిన సంగతి. అయితే ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ సడన్ గా చేంజ్ అవ్వడంతో పవన్ అటు వైపు వెళ్లాల్సి వచ్చింది.

Keerthy Suresh : ‘జవాన్‌’ సాంగ్‌‌కి కీర్తిసురేశ్‌ వేసిన డ్యాన్స్‌ చూశారా..?

దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ లు పడ్డాయి. ఇక ఈ మూవీ షూటింగ్ మళ్ళీ ఇప్పటిలో మొదలు కాదేమో అనుకోని అభిమానులంతా కంగారు పడ్డారు. తాజాగా ఆ సందేహాలు అన్నిటికి దర్శకుడు హరీష్ శంకర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. మూవీ షూటింగ్ ఏ మాత్రం ఆగలేదు, ముందుకు సాగుతూనే ఉంది అంటూ ఒక ట్వీట్ తో తెలియజేశాడు. సెట్ లో పవన్ ఫోటోలను షేర్ చేసి అభిమానాలకు కిక్ ఇచ్చాడు. ఆ ఫొటోల్లో పవన్ పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మరి ఆ పిక్స్ ని ఒకసారి మేరుకు చూసేయండి.

Vishal : ఆ దర్శకుడితో కలిసి అసలు పని చేయను..

కాగా ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela), సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత హరీష్ శంకర్, పవన్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.